దరిద్రం అంటే ఇదే.. ఫ్లాప్ అవుతుంది అని తెలిసిన రష్మిక చేసిన మూవీ ఏంటో తెలుసా..? ఎందుకంటే..?

సినిమా ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టాక ప్రతి నిర్ణయం చాలా కేర్ఫుల్ గా తీసుకోవాలి . అప్పుడే మన పేరు పది కాలాలపాటు ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతుంది . తొందరపాటున ఏదైనా సరే తప్పుడు నిర్ణయం తీసుకుంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు . అయితే అలాంటి బిగ్ రిస్క్ నుంచి బయటపడింది రష్మిక మందన్నా. నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన్నా.. ప్రజెంట్ పుష్ప2 సినిమా షూట్స్ లో బిజీగా ఉంది .

ఈ సినిమా హిట్ అయితే ఆమెకు గ్లోబల్ స్థాయిలో గుర్తింపు దక్కడం పక్కా అని చెప్పడంలో సందేహమే లేదు . బాలీవుడ్ లోనూ నాలుగు సినిమాల్లో నటిస్తుంది . రీసెంట్గా యానిమల్ సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసేసింది . అయితే రష్మిక మందన్నా తన కెరియర్లో ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది ..తనకు మంచి పేరు తీసుకురాదు అని తెలిసిన కూడా చేసిందట . ఆ మూవీ మరేదో కాదు “ఆడవాళ్లు మీకు జోహార్లు”. యస్ ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది.

శర్వానంద్ హీరోగా నటించిన ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది . ఈ సినిమా జనాలను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది . అయితే ఈ కాన్సెప్ట్ జనాలకి నచ్చుతుందా..? నచ్చదా..? పక్కన పెడితే అలాంటి కాన్సెప్ట్ లో ఒక్క మూవీ అయిన చేయాలి అంటూ రష్మిక డిసైడ్ అయ్యి సినిమా టాక్ నెగిటివ్గా వస్తుంది అని తెలిసినా కూడా ఓకే చేసిందట. అప్పట్లో ఈ వార్త బాగా సెన్సేషన్ అయింది. ఆమె అనుకున్నట్లే సినిమా ఫ్లాప్ అయ్యింది..!!