“ఛీ ఛీ ఆఖరికి నువ్వు కూడా నా..?”..స్టేజీ పై అనుపమ చేసిన పనికి ఫైర్ అవుతున్న ఫ్యాన్స్(వీడియో)..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ప్రతి చిన్న విషయాన్ని రాద్ధాంతం చేయడం బాగా కామన్ గా మారిపోయింది. ఎంతలా అంటే అక్కడ జరిగింది ఫన్నీ ఇన్సిడెంట్ ..చాలా సరదాగా మాట్లాడుకున్న మాటలు అని తెలిసిన సరే కావాలనే ట్రోల్ చేస్తున్నారు కొందరు ఆకుతాయిలు . కాగా రీసెంట్గా అలాంటి లిస్టులోకి బలైపోయింది అనుపమ పరమేశ్వరన్ . మలయాళ బ్యూటీ అయినా సరే తెలుగులో మంచి పాపులారిటీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ తాజాగా నటించిన సినిమా ఈగల్ .

కార్తీక్ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 9న రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోని సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిన్న నైట్ ఘనంగా నిర్వహించారు మేకర్స్ . సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించిన వీడియోస్ ట్రెండ్ అవుతున్నాయి. “ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో అనుపమ పరమేశ్వరన్ స్టేజ్ పైకి రాగానే కార్తీక్ తో ఉన్న బాండింగ్ గురించి చెప్పుకొచ్చింది . కార్తీక్ తో ఆల్రెడీ నాలుగు సినిమాలు చేశానని ఆయనను అన్నయ్య అని పిలవడం అలవాటైపోయింది అని ..మా మధ్య అంత బాండింగ్ ఉంది అంటూ చెప్పుకొచ్చింది .

“ఇంతలో పక్కనే ఉన్న హోస్ట్ సుమ రాఖీ తీసుకొస్తుంది . అంతేకాదు అనుపమ పరమేశ్వరన్ స్టేజ్ పైన ఆయనకు రాఖీ కట్టేస్తుంది . దీంతో స్టేజిపై అనుపమ డైరెక్టర్ కు రాఖీ కడుతుంటే జనాలు ఓ రేంజ్ లో అరుపులు కేకలతో దద్దరించేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . కొందరు ఈ వీడియోని చాలా సరదాగా తీసుకుంటూ ఉంటే మరికొందరు మాత్రం సినిమా ప్రమోషన్స్ కోసం ఇలా కూడా చేస్తారా..? ఆఖరికి నువ్వు కూడా ఇలా తయారైపోయావా అనుపమ..? అంటూ మండిపడుతున్నారు..!!