బాలకృష్ణ సినిమానే రిజెక్ట్ చేసిన ఆ స్టార్ బ్యూటీ.. తర్వాత ఏం జరిగిందో తెలిస్తే షాక్ అవుతారు..

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణకు తెలుగులో ఉన్న క్రేజ్ గురించి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న బాలయ్య.. డైలాగ్ కింగ్‌గా దూసుకుపోతున్నాడు. ఇక ప్రస్తుతం ఉన్న సీనియర్ స్టార్ హీరోలు అందరిలోనూ ముందంజలో ఉన్న బాలయ్య ఇటీవ‌ల హ్య‌ట్రిక్ హిట్లు అందుకున్నాడు. ప్ర‌స్తుతం బాల‌య్య సినిమా వస్తుందంటే చాలు ఆ సినిమా నుంచి వచ్చే చిన్న అప్డేట్ కోసం కూడా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక సినిమా రిలీజ్ అవుతుంది అంటే ముందు రోజు నుండే అభిమానుల సందడి మొదలైపోతుంది.

ఇక అసలు విషయానికి వస్తే బాలకృష్ణ సరసన నటించాలని ఎంతోమంది హీరోయిన్లు ఆశపడుతూ ఉంటారు. ఆ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఒక హీరోయిన్ మాత్రం బాలయ్య సినిమాలో ఛాన్స్ వచ్చిన ఆ సినిమాను రిజెక్ట్ చేసిందట. ఇంతకీ ఆమె ఎవరు.. ఆ సినిమా ఏంటో ఒకసారి తెలుసుకుందాం. గ‌తంలో బాలయ్య బాబు పక్కన హీరోయిన్గా అవకాశం వచ్చిన చేయనని సింపుల్గా తెల్చి చెప్పేసిందట స్టార్ హీరోయిన్ సాక్షి శివానంద్. బాలయ్య బాబు హీరోగా.. ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్లో తెరకెక్కిన కృష్ణ బాబు సినిమాలో హీరోయిన్ గా మొదట సాక్షి శివానంద్ కే ఆఫర్ ఇచ్చారట. అయితే ఆమె ఆ సినిమాకు నో చెప్పడంతో తర్వాత రాశిని కలిసి ఆ మూవీకి ఒప్పించారు. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత డిజాస్టర్ ఫలితాలను సొంతం చేసుకుంది.

ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సాక్షి శివానంద్ నిజంగానే చాలా తెలివైన డిసిషన్ తీసుకుందని కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది ఈ సినిమా డిజాస్టర్ ఫలితాలను అందుకుంటుందని.. ఆమెకు ముందే ఎలా తెలిసి ఉంటుంది అంటూ షాక్ అవుతున్నారు. ఇక నట‌సింహం బాలకృష్ణ ఇటీవల భగవంత్ కేస‌రితో బ్లాక్ బ‌స్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మరో సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా తర్వాత బోయపాటితో అఖండ 2 సినిమాకు ప్లాన్ చేశాడు బాలయ్య. ఇలా ప్రస్తుతం బిజీ లైన‌ప్‌తో వరుస సినిమాలో నటిస్తున్నాడు.