కంటి చూపుతోనే అమ్మాయిలను టెంప్ట్ చేసే సత్త ఉన్న .. ఈ పాన్ ఇండియా హీరోని గుర్తు పట్టారా..!

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోస్ ని ఎలా అభిమానిస్తూ ఉంటారో జనాలు మనకు తెలిసిందే. తమ ఫేవరెట్ హీరో పుట్టినరోజు అయిన తమ ఫేవరెట్ హీరో నటించిన సినిమా టీజర్ – ట్రైలర్- గ్లింప్స్ రిలీజ్ అవుతుంది అన్న ..సినిమా రిలీజ్ అవుతుంది అన్న థియేటర్స్ వద్ద చేసే హంగామా అంతా ఇంత ఉండదు . తమ సొంత ఇంటిలోని రక్తసంబంధం కి సంబంధించిన మనుషుల పుట్టినరోజు రేంజ్ లో సెలబ్రేట్ చేసుకుంటారు . అయితే ఈ మధ్యకాలంలో స్టార్ సెలబ్రిటీస్ ల చిన్నప్పటి ఫొటోస్ ని బాగా ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు .

ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటో గత రెండు రోజులుగా సినిమా ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంది . ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలోని కుర్రాడు ఓ బిగ్ పాన్ ఇండియా స్టార్ .. ఒక్కొక్క సినిమాకి వంద నుంచి 150 కోట్లు రెమ్యూనరేషన్ పుచ్చుకునే సత్తా ఉన్న హీరో . అఫ్కోర్స్ సినిమాలో నటించాక హిట్టు – ఫ్లాప్ సర్వసాధారణం . తన సినిమాలు ఫ్లాప్ అయినా సరే ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలో ఏం మాత్రం తగ్గని ..ఈ హీరో ఏకంగా తన చేతిలో ఆరు సినిమాలను పట్టుకుని ఉన్నాడు .

ఇప్పటికే ఈ హీరో ఎవరో మీకు అర్థం అయిపోయింది అనుకుంటాను.. ఇక్కడ మీరు చూస్తున్న ఈ హీరో మరెవరో కాదు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తనదైన స్టైల్ లో సినిమాలో నటిస్తూ యువతను ఆకట్టుకుంటున్న ప్రభాస్ చిన్నప్పటి ఫోటోనే ఇది . ప్రభాస్ లో చాలామందికి కళ్ళు అంటే ఇష్టం .ఆయన కళ్ళల్లోనే ఏదో తెలియని మ్యాజిక్ ఉంది అంటూ అమ్మాయిలు కామెంట్ చేస్తూ ఉంటారు . ప్రెసెంట్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చిన్నప్పటి ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది..!!