అప్పట్నుంచి మొదలుకానున్న సలార్ 2 షూటింగ్..!

రెబల్ స్టార్ ప్రభాస్ మనందరికీ సుపరిచితమే. ప్రభాస్ ఇటీవలే సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి భారీ విజయాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో ఈ సినిమా పార్ట్ 2 పై భారీ అంచనాలు నెలకున్నాయి.

అయితే ఈ సినిమా షూటింగ్ వచ్చే వేసవి నుంచి ప్రారంభించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. దేవర , వార్ 2 లతో ఎన్టీఆర్ ఫుల్ బిజీగా ఉండగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తాను చేయాల్సిన మూవీ ఆలస్యం అయ్యే ఛాన్సెస్ ఉందని తెలుస్తుంది. ఇక ఈలోపే ప్రశాంత్ నీల్ సలార్ 2 ను కంప్లీట్ చేసుకొని ఉన్నట్లు టాక్ నడుస్తుంది.

ఇక పార్ట్ 2 లో అఖిల్ అక్కినేని నటించబోతున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక మొదటి పార్ట్ దేశంలోనే సంచలనం సృష్టించింది. ఇక రెండవ పార్ట్ ఏ విధమైన రెస్పాన్స్ ని దక్కించుకుంటుందో చూడాలి మరి. హోంబలే ఫిలిమ్స్ నిర్మాణం వహిస్తున్న ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.