ప్రభాస్ ” రాజాసాబ్ ” పై అటువంటి కామెంట్స్ చేసిన మారుతి..!

కమర్షియల్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా ” రాజా సాబ్ ” అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ప్రభాస్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఇక తాజాగా ఈ సినిమాపై మారుతి సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ఈ సినిమా గురించి మాట్లాడిన మారుతి కొన్ని విషయాలను వెల్లడించాడు. ఈయన మాట్లాడుతూ..” రాజాసాబ్ సినిమా గురించి మాటల్లో చెప్పలేను. చేతల్లో చూపిస్తా. కెరీర్ తొలి నాళ్లలో ఈరోజుల్లో, బప్ స్టాప్ వంటి చిన్న సినిమాలు తీసా. అలా నెమ్మదిగా ప్రారంభమైన నా ప్రయాణం ఇప్పుడు ప్రభాస్ వరకు రావడం ఎంతో సంతోషంగా ఉంది.

రాజా సాబ్ నుంచి సర్ప్రైజ్ అప్డేట్ కోసం వేచి ఉండండి. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో నేను సినిమా చేయడం చాలా గొప్ప అనుభూతి. ముఖ్యంగా ఈ సినిమాలో వచ్చే యాక్షన్ సీన్స్ మెయిన్ హైలెట్ గా నిలుస్తాయి. అలానే ఇదొక మాస్ మసాలా ఎంటర్టైనర్ మూవీ. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉండబోతున్నారు ” అంటూ చెప్పుకొచ్చాడు మారుతి. ప్రస్తుతం ఈయ‌న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే డార్లింగ్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.