జక్కన్న సినిమా కోసం స్పెషల్ లుక్ లో దర్శనమిచ్చిన మహేష్.. వీడియో వైరల్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా టాలెంటెడ్ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాపై సూపర్ స్టార్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఇక తాజాగా మహేష్ హైదరాబాద్లో దర్శనమిచ్చాడు. అయితే మహేష్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కనిపించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనికి కారణం మహేష్ సరికొత్త లుక్ లో కనిపించడమే. దీంతో ప్రతి ఒక్కరి చూపు మహేష్ పై పడింది. ఇక మహేష్ కొత్త లుక్ రాజమౌళి సినిమా కోసమే అంటూ అనేక ప్రచారాలు జరుగుతున్నాయి.

ఇక ఇదే కనుక నిజమైతే సూపర్ గా ఉందని చెప్పొచ్చు. మహేష్ ని కొత్త లుక్ లో చూసిన పలువురు ఫిదా అవుతున్నారు. ఇక ఈ సినిమాలో ప్రియాంక చోప్రా ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా ఆ మధ్య విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా కథ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.