మరో మైదలాజికల్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తేజ సజ్జ.. డైరెక్టర్ ఎవరంటే..?

ఇటీవల టాలీవుడ్ లో చిన్న సినిమాగా రిలీజై బ్లాక్ బస్టర్ సాధించిన సినిమా హనుమాన్. దాదాపు రూ.300 కోట్ల కలెక్షన్లను రాబట్టి ఆల్ టైం రికార్డులను క్రియేట్ చేసిన ఈ సినిమా.. ఇప్పటివరకు 92 ఏళ్ల టాలీవుడ్ హిస్టరీ లోనే మునుపేన్నడు లేని విధంగా సంక్రాంతి బ్లాక్ ట‌స్టర్ గా రికార్డ్ సృష్టించింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ స‌జ్జ‌ హీరోగా రిలీజ్ అయిన ఈ చిన్న సినిమా టీజర్, ట్రైలర్ తోనే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొల్పింది. అయితే రిలీజ్ అయిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్‌కు తగ్గట్టుగానే సినిమా వేరే లెవెల్ లో సక్సెస్ అందుకుంది.

Pin by Flickstatus on Kollywood | Hanuman movie, Movie ...

ఇదే సినిమాలో హీరోగా నటించిన తేజ సజ్జ చేయబోయే తర్వాత ప్రాజెక్ట్ ఏంటి అనే అంశంపై ఇటీవల క్లారిటీ వచ్చేసింది. కాగా తన నెక్స్ట్ సినిమాను ఈగిల్‌ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్లో నటిస్తున్నాడట. ఈగిల్‌ ప్రమోషన్స్ లో భాగంగా ఈ విషయాన్ని కార్తీక్ ఘట్టమ‌నేని వివరించాడు. తేజతో చేయబోయే సినిమా కొంచెం మైథాలాజికల్ టచ్ ఉంటుందని.. దేవుళ్ళ కాన్సెప్ట్ ఉండదు కానీ.. హిస్టరీ కి సంబంధించిన సినిమాగా తెరకెక్కనుందని వివరించాడు. కొంచెం ఫాంటసీ మూవీగా కూడా అనిపిస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు.

Eagle Pre-release event Karthik Ghattamaneni Speech' ll SVV ll MOVIES -  YouTube

కాగా ప్రశాంత్ వర్మ చేయబోతున్న జై హనుమాన్ సినిమాలో పూర్తిస్థాయిలో తేజ కనిపించకపోవచ్చు, తేజ ప్రధాన పాత్రల్లో కనిపిస్తూ సినిమా స్టోరీ రన్ అవుతూ ఉండొచ్చు, ఈ విషయంపై స్టోరీ పూర్తయి ప్రశాంత్ వర్మ వివరిస్తే గాని క్లారిటీ రాదు, ఇక ప్రస్తుతం అమెరికాలో ఇప్పటికీ అదే క్రేజ్‌తో సినిమా దూసుకుపోతుంది. దీంతో ప్రశాంత్ వర్మ, తేజ, నిర్మాత నిరంజన్ రెడ్డి సినిమాను మరింతగా ప్రమోట్ చేస్తూ అక్కడ బిజీగా గడుపుతున్నారు.