హెల్త్ మినిస్టరీ బ్రాండ్ అంబాసిడర్ గా పూనమ్ పాండే.. కేంద్రం క్లారిటీ..

ఇటీవల బాలీవుడ్ స్టార్ యాక్ట్రెస్ పూనమ్‌ పాండే క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకు తాను చనిపోయినట్లు ప్రచారం చేయించుకుంది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం.. తర్వాత నేను చనిపోలేదంటూ ఆమె స్వయంగా క్యాన్సర్ పై అవగాహన కలిగించే వీడియోను రిలీజ్ చేయడంతో పూనమ్‌ పేరు మీడియాలో మారుమోగిపోయింది.

I am here, alive', says Poonam Pandey; was raising cervical cancer awareness - BusinessToday

ఈ నేప‌ధ్యంలో ఇటీవల సర్వైకల్ క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమాలకు ప్రచారకర్తగా పూనమ్‌ పాండే పేరును కేంద్రం పరిశీలిస్తుందంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. దీనిపై హెల్త్ మినిస్టర్ తాజాగా రియాక్ట్ అయింది. పూనమ్ పాండే పేరు తమ పరిశీలనలో లేదని బుధవారం క్లియర్ చేసింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో ఆమె టీం, ఇంకా పూనప్‌ పాండే చర్చలు జరుపుతున్నారంటూ వార్తలు వినిపించాయి.

Poonam Pandey death stunt: Everything we know about her publicity gimmick - Hindustan Times

ఈ క్రమంలో.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇచ్చింది. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం సర్వైకల్ క్యాన్సర్ పై ప్రచార కార్యక్రమం చేపడుతోందని.. దానికి పూనమ్ పాండే బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తుందంటూ వచ్చిన వార్త‌లో నిజం లేద‌ని తేల్చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ క్లారిటీ ఇవ్వడంతో ఈ వార్తలకు చెక్ పడినట్లు అయింది.