మహేష్ సూపర్ హిట్ సాంగ్ కు విరాట – అనుష్క డ్యాన్స్‌.. వీడియో వైరల్..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన గుంటూరు కారం మూవీ సంక్రాంతి పండుగకు రిలీజై కలెక్షన్ల పరంగా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో కుర్చి మడతపెట్టి అనే ఊరమా సాంగ్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్న‌ సంగతి తెలిసిందే. ప్రస్తుతం సంచాలనం సృష్టిస్తున్న ఈ సాంగ్ ను థ‌మ‌న్ కంపోజ్ చేశాడు. ఈ పాట‌ సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతుంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరు ఈ పాటకు డ్యాన్స్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు.

Kurchi Madatha Petti: Mahesh Babu's New Year treat - TrackTollywood

అందుకు సంబంధించిన రీల్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా మహేష్, శ్రీ లీలా స్టెప్పులు ఈ సినిమాలో హైలెట్గా నిలిచాయి. ముఖ్యంగా ఈ సాంగ్లో మునుపేన్నడు లేని విధంగా మహేష్ బాబు మాస్ డ్యాన్స్ తో అదరగొట్టాడు. ఎంతో కాలంగా ఇలాంటి మాస్ సాంగ్‌ కోసం ప్రేక్షకులు ఎదురుచూశారు. త్రివిక్రమ్ ఈ సాంగ్ తో మహేష్ అభిమానుల కోరికను కూడా తీర్చేసాడు అని చెప్పవచ్చు.

Virat Kohli And Anushka Sharma Telugu News : Virat Kohli And Anushka Sharma Latest Telugu News | Virat Kohli And Anushka Sharma LIVE Updates - Oktelugu Telugu

ఇప్పుడు తాజాగా టీం ఇండియా ప్లేయర్ విరాట్ కోహ్లీ, అనుష్క జంట ఈ పాటకు డ్యాన్స్ స్టెప్పులతో అదరగొట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే విరాట్, అనుష్క నిజంగా ఈ సాంగ్ కి డ్యాన్స్ వేశారా అంటే కాదనే చెప్పాలి. గతంలో డ్యాన్స్ చేసిన ఓ వీడియా ను ఫేర్ చేశారు. ఇక ఈ స్టెప్పులు ఆ పాటకు బాగా సింక్ అవడంతో వీడియోను లైక్ కొడుతూ మరింత ట్రెండ్ చేస్తున్నారు నెటిజన్లు.