‘ ఈగిల్ ‘ మూవీ రివ్యూ: రవితేజ ఊర మాస్ జాత‌ర‌.. ఈసారి బొమ్మ హిట్టా.. ఫ‌టా ..

మాస్ మహారాజు రవితేజ ఇటీవల నటించిన మూవీ ఈగిల్ ఫుల్ ఆఫ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ సినిమా ఈరోజు రిలీజై ప్రీమియర్ షో లను ముగించుకుంది. ఈ క్రమంలో ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మాస్ మహారాజ్ రవితేజకు చాలాకాలంగా సరైన హిట్ లేదు. ఈ మధ్యకాలంలో క్రాక్ తర్వాత ఆయన నుండి ఆ రేంజ్ సక్సెస్ రాలేదు. ధమాకా కొంచెం పర్లేదు అనిపించింది. వరుస సినిమాలు చేస్తున్న సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో యంగ్‌ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని కి ఛాన్స్ ఇచ్చాడు మాస్ మహారాజ్.

ఈగిల్ ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. అనుపమ పరమేశ్వరన్, కావ్య థ‌ఫర్ హీరోయిన్గా నటించిన సినిమాల్లో మధుబాల, వినయ్ దీప్ కీరోల్స్ లో నటించారు. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ ప్రేక్షకుల్లో అంచనాలను భారీగా పెంచేసింది. అదే టైంలో రవితేజ మూవీ చూసి పూర్తిగా సంతృప్తి చెందినట్లు ఆయన సినిమాకు ఆయనే రివ్యూ ఇచ్చాడు. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ హైప్ పెంచేలా లాస్ట్ 40 నిమిషాలు అదిరిపోతుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ మూవీకి ఆడియోస్ నుంచి మాత్రం మిక్స్డ్ టాక్ వెలువడింది.

Ravi Teja's first reaction after watching Eagle - 'I'm super satisfied'.  Watch video

ఈగిల్ పూర్తిగా కే జి ఎఫ్‌లా తెరకెక్కిందని చెప్తున్నారు. ఫస్ట్ హాఫ్ లో హీరో గురించి పలు పాత్రలు చెప్పి ఎలివేషన్స్ తో కొనసాగుతుందట. జర్నలిస్ట్ అనుపమ పరమేశ్వరన్ హీరో సహదేవ వర్మ గురించి ఆర్టికల్స్ పబ్లిష్ చేస్తూ.. సహదేవ వర్మను ఆకాశానికి ఎత్తుతూ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ లో రవితేజ స్క్రీన్ స్పేస్ కూడా చాలా తక్కువ. కథలో కొంత కొత్తదనం ఉన్న స్టోరీ ఆసక్తికరంగా సాగలేదట. రవితేజ లుక్‌, క్యారెగరైజేషన్ యాక్షన్ ఎపిసోడ్లు ఆకట్టుకుంటాయి. రవితేజ ఎనర్జీ, స్క్రీన్ ప్రజెంట్ కట్టిపడేస్తున్నాయి. ఇక జర్నలిస్టుగా అనుపమ పరమేశ్వరన్ మెప్పించింది. కావ్య తఫర్ న‌టనకు మంచి మార్కులు ప‌డ్డాయి.

Eagle Movie Trailer Releasing Date & Time | Eagle Telugu Movie Trailer  Update | Ravi Teja Eagle Movie Trailer | When Is Eagle Movie Trailer  Releasing - Filmibeat

అయితే వినయ్ రాయ్, మధుబాల లాంటి నటులను పూర్తిస్థాయిలో యూస్ చేయలేదు అంటున్నారు. సాంకేతికంగా మూవీ రిచ్ గా అనిపించినా.. మ్యూజిక్ ఆకట్టుకోలేదట. బిజిఎం ఓకే అనిపించుకుంది. సాంగ్స్ మాత్రం తగ్గట్టుగా లేవు. దీంతో డైరెక్టర్ పూర్తి సక్సెస్ అందుకోలేదని చెప్పాలి. మాస్ మహారాజ్ రవితేజ ఫ్యాన్స్ ని మెప్పించే అంశాలు సినిమాలో చాలా కనిపిస్తాయి. మొత్తంగా ఈగిల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్.. కే జి ఎఫ్ స్పూర్తి తోనే డైరెక్టర్ కార్తీక్ సినిమాను రూపొందించాడు. యాక్షన్ సన్నివేశాలు అలరింయిన‌ స్టోరీ అంతగా మెప్పించలేదు. అయితే రవితేజ ఫాన్స్ కు మాత్రం సినిమా బాగా నచ్చుతుంది. ఫ్యాన్స్ కి నచ్చే చాలా సన్నివేశాలు సినిమాలో కనిపిస్తాయి.