తల్లి కాబోతున్న నితిన్ బ్యూటీ.. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా..?

‘ నువ్విలా ‘ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన యామీ గౌతమ్ కు తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ సినిమా తర్వాత గౌరవం, యుద్ధం, కొరియర్ బాయ్ కళ్యాణ్ లాంటి ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. నితిన్‌తో నటించిన కొరియర్ బాయ్ కళ్యాణ్ సినిమాతో ఈమెకు మంచి పాపులారిటీ దక్కింది. తెలుగులోనే కాకుండా సౌత్ సినిమాలన్నింటిలోనూ మెప్పించిన ఈ ముద్దుగుమ్మ తర్వాత బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి అక్కడ పాపులర్ బ్యూటీగా మారిపోయింది.

Watch Courier Boy Kalyan (Telugu) Full Movie Online | Sun NXT

తాజాగా తన ప్రేగ్నెన్సీ వార్త నెట్టింట‌ తెగ వైరల్ అవుతుంది. యామి గౌతమ్ తన మొదటి బిడ్డకు జన్మని ఇవ్వబోతుంది అంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. నిర్మాత.. భర్త ఆదిత్య ధ‌ర్‌తో తను మొదటి బిడ్డను ఆశిస్తున్నారట ఈ జంట. ప్రస్తుతం ఆమెకు ఐదో నెల అని సమాచారం. పెళ్లైన మూడు ఏళ్లకు ఈ జంట గుడ్ న్యూస్ చెప్పడంతో ఫ్యాన్స్ అంతా ఆమెకు విషెస్ తెలియజేస్తున్నారు. ఈ ఏడాది పండంటి బిడ్డకు జన్మనింపాలంటూ వాళ్లు బ్లెస్ చేస్తున్నారు.

Yami Gautam, Aditya Dhar confirm pregnancy at Article 370 trailer launch:  'There is a baby on the way' | Bollywood News - The Indian Express

సౌత్‌కు చెందిన యామి గౌతమ్ బాలీవుడ్ లో ప్రస్తుతం వరుస‌ సినిమాలో నటిస్తూ దూసుకుపోతుంది. ప్రస్తుతం ఆర్టికల్ 360 సినిమాలో నటిస్తున్న ఈమె ప్రమోషన్స్ లో సందడి చేస్తుంది. ఈ క్రమంలో యామి గౌతమ్ గురించి అభిమానులకు శుభవార్త వినిపిస్తున్న.. ఈ జంట అయితే ఇప్పటి వరకు అఫీషియల్ గా దానిని ప్రకటించలేదు. త్వరలోనే ఈ జంట తమ అభిమానులకు ఈ శుభవార్తను అఫీషియల్ గా ప్రకటిస్తారని భావిస్తున్నారు.