బిగ్ బంపర్ ఛాన్స్ కొట్టేసిన మృణాల్.. ఆ లెజెండ్రీ డైరెక్టర్ మూవీ లో అవకాశం..

సీతారామమ్‌ బ్యూటీ మృణాల్ ఠాగూర్ తెలుగు ప్రేక్షకుల‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ సినిమాలో సీతగా, నూర్‌జ‌హాన్‌గా కట్టు,బొట్టుతో సాంప్రదాయంగా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. తన న‌ట‌న‌తో మెస్మరైజ్ చేసిన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమా తర్వాత తెలుగులో పలు ప్రాజెక్టులతో బిజీ అయింది. ఇటీవల నాని.. హాయ్ నాన్న సినిమాతో మరో సక్సెస్ అందుకుంది మృణాల్‌. కాగ మొదట బాలీవుడ్ లో పలు సీరియల్స్ లో నటిస్తూ పాపులాటి దక్కించుకుంది. జడ్జి, సూపర్ 30 సినిమాలతో క్రేజ్ అందుకున్న‌ ఈమె ప్రస్తుతం తెలుగులో రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది.

ఈ నేపథ్యంలో మృణాల్ తో సినిమా చేయడానికి ఓ పెద్ద నిర్మాణ సంస్థ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ నుంచి మృణాల్ కు బిగ్ బంపర్ ఆఫర్ వచ్చిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలి దర్శకత్వంలో ఎన్నో సినిమాలు రిలీజై సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో దేవదాస్, బాజీరావు మస్తానీ, పద్మావత్, రామలీల లాంటి ఎన్నో సినిమాలు రూపొందించిన‌ ఈయన డైరెక్షన్లో ఆమెకు అవకాశం దక్కిందట.

ఇక సంజ‌య్‌.. భ‌న్సాలి ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎన్నో హిట్ సినిమాలను నిర్మించాడు. ఇక ప్రస్తుతం హీరామండి వెబ్ సిరీస్ నిర్మించి రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నాడు. దీంతోపాటే లవ్ అండ్ వార్ కూడా రాన్నుంది. ఇక ఓ రొమాంటిక్ మూవీ కూడా తెరకెక్కనుందట‌.. ఇందులో మృణాల్‌ను తీసుకుంటున్నట్లు టాక్. న‌ట‌నలో మృణాల్ ఠాగూర్ తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆమెను సంజయ్ లీల భ‌న్సాలి త‌న మూవీ కోసం సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తుంది.