సాయి పల్లవి అభిమానులకు గుండెలు పగిలిపోయే వార్త .. కలలో కూడా ఊహించనిది..!

ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ సంపాదించుకున్న సాయి పల్లవి పెళ్లి అయిపోయిందా..? అంటే అవునన్నా సమాధానమే వినిపిస్తుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సాయి పల్లవి పెళ్లయిపోయింది అని ..స్వయాన ఓ హీరో ప్రకటించడం ఇప్పుడు అభిమానుల గుండెలు బద్దలైపోయేలా చేస్తుంది.

అఫ్కోర్స్ ఇది ఆ స్టార్ హీరో చాలా సరదాగానే అన్నప్పటికీ చాలామంది మాత్రం సీరియస్ గా తీసుకుంటున్నారు . గతంలో టాలీవుడ్ నాచురల్ స్టార్ హీరో నాని – సాయి పల్లవి నటించిన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. “ఇప్పుడు నేను మీకు ఒక బ్రేకింగ్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చెప్పబోతున్నాను ..ప్రోమో వేసుకోండి .. అందుకే ఈ ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాను ..సాయి పల్లవికి ఎప్పుడో పెళ్లయిపోయింది” అంటూ బిగ్ బాంబు పేలుస్తాడు .

సరదాగా నాని చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సీరియస్ గా ట్రోల్ చేస్తున్నారు జనాలు . “ఓహో అందుకే సాయి పల్లవి చెల్లెలు పెళ్లి చేసుకోబోతుందా ..?”అంటూ కొందరు వెటకారంగా అంటుంటే.. మరికొందరు మాత్రం సాయి పల్లవి అలాంటిది కాదు అంటున్నారు . అయితే సాయి పల్లవి కూడా దానికి క్లారిటీ ఇచ్చేసింది . “ఇప్పుడు ఈ వీడియో మా అమ్మ చూస్తే వెంటనే మా డాడీకి కాల్ వెళుతుంది “అంటూ కౌంటర్ వేస్తుంది . సాయి పల్లవి మాటలకి నాని రిప్లై ఇస్తూ..” ఆంటీతో నేను మాట్లాడతాను “అంటూ సరదాగా నవ్వేస్తాడు . దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!