సైలెంట్ గా బిజినెస్ స్టార్ట్ చేసిన ట్రెడిషనల్ బ్యూటీ.. స్నేహ బిజినెస్ ఏంటో తెలుసా..?

టాలీవుడ్ సీనియర్ స్టార్ బ్యూటీ స్నేహ ట్రెడిషనల్ బ్యూటీగా ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఈమె త‌న కట్టు, బొట్టు, అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎన్నో హిట్ సినిమాలు నటించి తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న స్నేహ.. సౌత్ సినీ ఇండస్ట్రీలో పలు భాషల్లో నటించి మెప్పించింది. అయితే వివాహం తర్వాత సినీ ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి కెరీర్ కొనసాగిస్తుంది. సౌత్ సినిమాల్లో పలు భాషల్లో కీలకపాత్రలో నటిస్తూ మెప్పిస్తుంది.

ఇక సినిమాల్లో జోరు కాస్త తగిన.. సోషల్ మీడియాలో మాత్రం తగ్గేది లే అంటూ దూసుకుపోతున్న స్నేహ.. ఇటీవల ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని ఫాన్స్ తో షేర్ చేసుకుంది. బ్యూటిఫుల్ ఫోటోషూట్లతో వీక్షకులను ఆకట్టుకుంది. ఇక ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో షేర్ చేసుకునే ఈ సీనియర్ బ్యూటీ.. ఫ్యాన్స్ కు తాజాగా గుడ్ న్యూస్ చెప్పింది. తన కొత్త వ్యాపారం త్వరలోనే స్టార్ట్ కాబోతున్నట్లు వివరించింది. ఇందులో భాగంగానే నా కెరీర్, లైఫ్ లో గ్రేట్ సపోర్ట్ ను అందించిన నా ప్రియమైన అభిమానులందరికీ.. ఇన్నాళ్లు మీరు నాపై కురిపించిన ప్రేమకు మీ అందరికీ రుణపడి ఉంటా అంటూ వివరించింది.

ఎవరి జీవితంలోనైనా వారి క‌ల‌లు నెరవేరడం చాలా గొప్ప విషయం. నేను ఇప్పుడు అలాంటి అద్భుతమైన ఫీల్ ను ఎంజాయ్ చేస్తున్న. నేను నా సొంత సిల్క్ చీర స్టోర్.. స్నేహాలయా సిల్క్స్ ను ప్రారంభిస్తున్న. ఎప్పటిలాగే మీ అందరి ప్రేమ ఆశీర్వాదాలు నాకు అందాలని కోరుకుంటున్నాను అంటూ ఈ పోస్ట్ లో షేర్ చేసుకుంది. ఈ పోస్ట్ కు రెస్పాండ్ అవుతూ స్నేహ అభిమానులు మీ స్టోర్ సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలంటూ.. మీ శారీ బిజినెస్ బాగా జరగాలంటూ విష్ చేస్తున్నారు.. స్నేహకు ఆల్ ది బెస్ట్ చెప్తూ తమ ఆనందాన్ని తెలియజేస్తున్నారు. ఇక ఫిబ్రవరి 12న ఈ స్టోర్ స్టార్ట్ కాన్నుంది.