సూపర్ ట్విస్ట్: మహేష్ – రాజమౌళి మూవీలో ఆ ఇండోనేషియా బ్యూటీ.. బ్యాక్ గ్రౌండ్ ఇదే..

ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు – దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మూవీ ఒకటి. గ్లోబల్ రేంజ్ లో యాక్షన్ అడ్వెంచర్స్ మూవీగా తెర‌కెక్కుతున్న ఈ సినిమా హాలీవుడ్ రేంజ్‌లో మరింత భారీగా రిలీజ్ కానుంది. ఆర్‌ఆర్ఆర్ సినిమాతో అంతర్జాతీయంగా రాజమౌళి పాపులర్ అయ్యాడు. చాలామంది హాలీవుడ్ దిగంగ‌జ‌ దర్శకులు ఆయనను ప్రశంసించారు. దీంతో రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ పై కూడా అంతకుమించి అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మహేష్ – రాజమౌళి మూవీలో ఇండోనేషియా నటి ఓ కీలక పాత్రలో చేయబోతుందని తెలుస్తుంది. మహేష్ తో జ‌క్క‌న ఈ మూవీని గ్లోబల్ స్థాయిలో రూపొందిస్తున్నాడు.

latest Update on SS Rajamouli and Superstar Mahesh babus movie | Mahesh Babu  - Rajamouli: ఆ నెలలోనే ప్రారంభం కానున్న మహేష్ బాబు - రాజమౌళి సినిమా News in  Telugu

ఇందులో భాగంగానే విదేశీ న‌టుల‌ను కూడా ఈ సినిమాలో తీసుకుంటున్నారని టాక్. ఇందుకు తగ్గట్టుగా ఇండోనేషియా స్టార్ న‌టి ‘ చిల్సీ ఎలిజబెత్ ఇస్లాం ‘ అనే నటిని ఈ సినిమా కోసం రాజమౌళి సెలెక్ట్ చేశాడట. ఈ సినిమాలో ఆమె ఓ కీలక పాత్రలో నటించబోతుందని తెలుస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో ఒకసారి చూద్దాం. అమెరికాలో పుట్టి పెరిగిన ఆమె ఇండోనేషియా సినిమాల్లో స్టార్ గా పాపులర్ అయింది. డి బాలిక్, రోడి, హబీబి, ఏ కాఫీ ఆఫ్ మైండ్, మేరీ డెవిల్ టేక్ యు లాంటి ఎన్నో సినిమాలలో నటించి పాపులారిటీ దక్కించుకుంది. నటనలో తన సత్తా చాటుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం మహేష్ సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తుంది.

అయితే దీనిపై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ ఇంకా వెలువడలేదు. కాగా మహేష్ 29వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఎస్ఎస్ఎంబి 29 టైటిల్ తో పిలుస్తున్నారు. ఇంకా ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాలేదు. ఏప్రిల్ నుంచి షూటింగ్ మొదలవుతుందని టాక్. అయితే షూటింగ్ మొదలు కాకముందే రాజమౌళి ఈ సినిమాపై కొన్ని ఆసక్తికర విషయాలు ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తాడ‌ని తెలుస్తుంది. ఈ ప్రెస్ మీట్ లోనే ఈ ఇండోనేషన్ యాక్టర్ ‘ చిల్సీ ఎలిజబెత్ ఇస్లాం ‘ ను రాజమౌళి పరిచయం చేయబోతున్నాడట. అయితే ఈ సినిమాలో ఈమె హీరోయిన్గా నటిస్తుందా.. లేదా ఓ ప్రధాన పాత్రలో మెప్పించబోతుందా అనేది తెలియాల్సి ఉంది.