బిగ్ బ్రేకింగ్: ఉన్నట్టుండి చేతికి కట్టుతో దర్శనమిచ్చిన అల్లు అర్జున్.. టెన్షన్ లో బన్నీ ఫ్యాన్స్..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా హైదరాబాదులో భారీ స్కెడ్యూల్ నిర్వహిస్తుంది. గతంలో ఈ సినిమాలో గంగమ్మ జాతర కాన్సెప్ట్ కు భారీ బడ్జెట్ కేటాయించినట్లు వార్తలు వినిపించాయి. అయితే ఇటీవల ఈ సినిమా నుంచి లీకైన అల్లు అర్జున్ ఫోటో చూస్తుంటే ఆ గంగమ్మ జాతరకు సంబంధించిన సీన్స్ ఇప్పుడు షూటింగ్ జరుగుతుందని తెలుస్తుంది. ఈ ఫోటోలో అల్లు అర్జున్ చీర కట్టుకొని కనిపిస్తాడు.

ఈ నేప‌ధ్యంలో ఈ సినిమాకు సడన్ బ్రేక్ వచ్చిందని సమాచారం. అల్లు అర్జున్ సినిమా షూటింగ్లో భాగంగా ప్రమాదానికి గురయ్యారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం గురించి ఇప్పటివరకు ఎటువంటి అఫీషియల్ ప్రకటన రాలేదు. అయినప్పటికీ అల్లు అర్జున్ కు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ ఫోటోలో ఇవన్నీ చేతికి బ్యాండేజ్ వేసుకుని కనిపించాడు. దీన్ని బట్టి బన్నీకి ఏదో ప్రమాదం జరిగిందని తెలుస్తుంది. కాగా ఈ సినిమా ఫుల్ ఆఫ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో తెర‌కెక్కుతున్న సంగతి తెలిసింది. యాక్షన్స్ సీన్స్‌ షూటింగ్ టైంలోనే ఏదో ప్రమాదం జరిగి ఉంటుందని.. దీంతో ఆయన ఎడమ చేతికి తీవ్రమైన గాయాలు కావడంతో.. అలా బ్యాండేజ్ వేసుకున్నారని సమాచారం.

ఇలా చేతికి బ్యాండేజ్ కట్టుకొని ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. అభిమానులు టెన్షన్ పడుతున్నారు. అసలు బన్నీకి ఏమైంది ఇలా చేతికి బ్యాండేజ్ ఏంటి.. సడన్గా ఎలా తగిలింది అంటూ నెట్టింట‌ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే బన్నీ కాలివేళ్లకు కూడా తీవ్రంగా గాయాలు జరిగాయని టాక్. కాగా ఈ ఫోటోలు తెగ వైరవడంతో ఫ్యాన్స్ లో కంగారు మొదలైంది. ఇక‌ డాక్టర్స్ మాత్రం వ‌న్ వీక్‌ విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని చెప్పడంతో షూటింగ్ వాయిదా పడిందట.