ప్రభాస్ పాన్ ఇండియా మూవీలో ఛాన్స్ కొట్టేసిన మృణాల్ ఠాగూర్.. ఇది కదా జాక్‌పాట్ అంటే..

పాన్ ఇండియ‌న్ స్టార్ హీరో ప్రభాస్ హీరోగా.. నాగ అశ్విన్ ద‌ర్శ‌ఖత్వంలో తెర‌కెక్కుతున్న మూవీ కల్కి 2898 ఏడి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సరవేగంగా జరుగుతుంది. సైన్స్ ఫ్రిక్షన్, యాక్షన్ బ్యాక్ డ్రాప్లో థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సినిమా హిందూ.. మైతలాజికల్ జానర్‌లో తెరకెక్కనుంది. ఇందులో భాగంగా ఇతిహాసాల్లో ఉన్న సప్త చిరంజీవులుగా సినీ ఇండస్ట్రీ స్టార్ సెలబ్రిటీలను తీసుకున్నారు. మేకర్స్‌. ఇప్పటికే ఇందులో ఎంతోమంది స్టార్ సెలబ్రిటీస్ నటించబోతున్నారంటూ వార్తలు వైరల్ అయ్యాయి.

Mrunal Thakur sports gajra or flowers in the hair and Indian wear in recent  fashion take - Telegraph India

ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో అప్డేట్ తెగ చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం ఇందులో దీపిక పదుకొనే హీరోయిన్గా నటిస్తున్నా.. రాధా పాత్ర కోసం హీరోయిన్ మృణాల్ ఠాగూర్ సెలెక్ట్ అయినట్లు తెలుస్తోంది. కృష్ణుడి ప్రేయసి రాధ పాత్రలో మృణాల్‌ కనిపించబోతుందట. దీని గురించి అధికారిక ప్రకటన రాకపోయినా ప్రస్తుతం ఈ వార్త తెగ వైరల్‌ అవుతుంది. దీంతో మృణాల్ ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా ఈ వేసవి సెలవుల్లో.. మే 9న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానుంది.

Prabhas FC on X: "The previous highest #Salaar Overseas Rights, the highest  for any Indian film, were surpassed by #Kalki2898AD 🔥🔥🔥. Distributors  are eager to purchase the theatrical overseas rights for KALKI

ఇక వైజయంతి బ్యానర్స్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఇప్పటికే రిలీజ్ సెంటిమెంట్ వ‌ర్కౌట్ అయ్యేలా మేకర్స్ ప్లాన్ చేశారు. గతంలో మే 9న రిలీజ్ అయిన జగదేకవీరుడు అతిలోకసుందరి, మహానటి బ్లాక్ బస్టర్లుగా నిలిచి కలెక్షన్ల వర్షం కురిపించాయి. కాగా ఇప్పుడు కూడా ఇదే బ్యానర్ లో మే 9న కల్కిని రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఈ సెంటిమెంట్ మళ్లీ వర్కౌట్ అయితే కల్కి భారీ బ్లాక్ బ‌స్టర్ అందుకోవడం ఖాయం. ఇక ఇలాంటి భారీ పాన్ ఇండియన్ మూవీ లో మృణాల్ నిజంగా నటించినట్లయితే.. ఈ సినిమా తర్వాత ఆమెకు మరిన్ని అవకాశాలు క్యూ కడతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.