ఎలక్షన్స్ కంటే ముందే థియేటర్స్ లోకి వ్యూహం.. రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన ఆర్‌జీవి..

టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇటీవల వ్యూహం సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ రిలీజ్‌కి ఇప్పటికే ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. తాజాగా సినిమా రిలీజ్‌కు లైన్ క్లియర్ చేసుకోవచ్చని సెన్సార్ బోర్డ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో సినిమా రిలీజ్ పై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తన ఎక్స్ పేజ్‌లో ఒక పోస్ట్ షేర్ చేశాడు.

వ్యూహం సినిమాకు అడ్డంకులు తొలగిపోవడంతో తను సెలబ్రేషన్స్ చేసుకుంటున్నట్లు ఆయన అందులో వివరించాడు. ఫిబ్రవరి 23న వ్యూహం రిలీజ్ కానుందని అధికారికంగా ప్రకటించాడు. నిజానికి రెండు నెలల క్రితమే వ్యూహం రిలీజ్ కావాలి. అయితే సినిమా నిలిపివేయాలంటూ హైకోర్టులో టీడిపి నేత నారా లోకేష్ వేసిన పిటిషన్‌తో ఈ సినిమా రిలీజ్‌కు కాస్త‌ గ్యాప్ వచ్చింది.

వ్యూహం సినిమాపై మరోసారి ఓ కమిటీ సమీక్షించి సెన్సార్ క్లియరెన్స్ ఇవ్వడంతో విడుదలకు సిద్ధమయింది. ఫిబ్రవరి 23వ వ్యూహం ప్రేక్షకుల ముందుకు రానుంది. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జరిగిన పరిణామాలను ఆధారంగా తీసుకుని ఈ సినిమాను ఆర్‌జీవి రూపొందించినట్లు సమాచారం.