“దాని కోసం స్వయంగా హీరోయిన్ ఇంటికి వెళ్లిన సుకుమార్”.. అంత నచ్చేసిందా..?

ప్రజెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ బడా డైరెక్టర్గా పాపులారిటీ సంపాదించుకున్న సుకుమార్ ఒక హీరోయిన్ ఇంటికి వెళ్ళాడా..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ టాలీవుడ్ ప్రముఖుల సైతం ఈ వార్తను విని ఆశ్చర్యపోతున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా పాపులారిటీ సంపాదించుకున్న సుకుమార్ స్వయాన హీరోయిన్ సాయి పల్లవి ఇంటికి వెళ్ళాడు అన్న వార్త వైరల్ అవుతుంది.

పుష్ప2 సినిమాలో ఇంపార్టెంట్ పాత్ర కోసం ఆమెను చూస్ చేసుకున్నారట.. కానీ ఆమె రిజెక్ట్ చేసిందట. దీంతో స్వయాన సుకుమార్ ఆ పాత్రకు ఒప్పించడానికి సాయి పల్లవి ఇంటికి వెళ్లారట. ఈ విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . అంతేకాదు గతంలో ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ ఏకంగా సుకుమారే సాయి పల్లవికి లేడీ పవర్ స్టార్ అంటూ ట్యాగ్ ఇచ్చారు . మొదటి నుంచి సాయి పల్లవి అంటే సుకుమార్ కు ఓ గుడ్ ఇంప్రెషన్..

టాలెంట్ ని నమ్ముకొని పైకి వచ్చింది అని చాలా స్టేజీలపై ఆమెను పొగిడేసారు. దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. మొత్తానికి సుకుమార్ నే తన ఇంటికి రప్పించుకునేలా చేసుకుంది సాయి పల్లవి అన్న న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ లోనే కాదు మాలీవుడ్..కోలీవుడ్ లో కూడా బాగా వైరల్ గా మారింది. చూద్దాం ఏం జరుగుతుందో..?