సినిమాలు లేకపోయినా కోట్లల్లో సంపాదిస్తూ అందరికీ ఇన్స్పిరేషన్ గా ఆ స్టార్ బ్యూటీ.. తెలివికి ఫిదా అవ్వాల్సిందే..

సీనియర్ స్టార్ హీరో విజయ్ కుమార్ కుమార్తెలలో ప్రీతా విజయ్ కుమార్ కూడా ఒకరు. రుక్మిణి సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ చిన్న ప్రీతా ఆ తర్వాత క్షేమంగా వెళ్లి లాభంగా రండి, ప్రియమైన నీకు, మా అన్నయ్య లాంటి ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. డైరెక్టర్ హరి ని వివాహం చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. ఇక పెళ్లి తర్వాత ప్రీత నటనకు గుడ్ బై చెప్పేసింది. కాగా డైరెక్టర్ హరి సింగం సిరీస్‌ల‌తో సౌత్ స్టార్ డైరెక్టర్ గా పాపులారిటీ దక్కించుకున్నాడు. డైరెక్టర్ హరి రమ్యునరేషన్ కూడా కోట్లలో ఉంటుందట. అయితే అతడి భార్య ప్రీత కూడా సంపాదనలో ఏమాత్రం తగ్గడం లేదు.

ఈ జంటకి ముగ్గురు కొడుకులు. ఫ్యామిలీని చూసుకుంటూనే.. ప్రీత విజయ్ కుమార్ తన తెలివితేటలతో బిజినెస్ రన్ చేస్తుంది. చూడడానికి ప్రితా విజయ్ కుమార్ హోమ్లీగా కనిపించినా.. ఆమె బిజినెస్ మైండ్ మాత్రం అందరిని ఫిదా చేసే రేంజ్ లో ఉంటుంది. చెన్నైలోని బీచ్‌కి దగ్గరగా ఉతండి అనే ప్రాంతంలో ప్రీత విజయ్‌ కుమార్ ఒక లగ్జరీ కళ్యాణమండపాన్ని రన్ చేస్తుంది. దాని పేరు ప్రీతి ప్యాలెస్. బీచ్ లొకేషన్ కావడంతో ఆ కళ్యాణ మండపం బాగా పాపులర్ అయింది.

అలాగే కళ్యాణ మండపానికి దగ్గరలో కేవలం మహిళా వర్కర్ల తోనే ఒక కాఫీ షాప్ ను ఏర్పాటు చేసి.. అది కూడా సక్సెస్ఫుల్గా రన్ చేస్తుంది. అలాగే కాఫీ షాప్స్ కి పలు బ్రాంచెస్ కూడా పెట్టి చాలా మంది మ‌హిళ‌ల‌కు ఉపాధి క‌ల్పిస్తుంది. అదేవిధంగా వీడియో ఎడిటింగ్, డబ్బింగ్ స్టూడియోలను కూడా రన్ చేస్తుంది. ఇలా సక్సెస్ఫుల్గా ల‌న‌ బిజినెస్ లు అన్నిటిని రాణిస్తూ ప్రీతా విజయ్ కుమార్ నెల తిరిగేసరికి లక్షల్లో సంపాదిస్తుంది. ఏడాదికి కోట్లల్లో సంపాదిస్తూ భర్తకి గట్టి పోటీ ఇస్తుంది. ఓవైపు స్టార్ డైరెక్టర్గా హరి, మరోవైపు బిజినెస్ మైండ్‌తో ప్రీత దూసుకుపోతూ అందరికీ ఆశ్చర్యాన్ని కల్పిస్తున్నారు.