“నేను ఆ పని చేయాలంటే.. విజయ్ దేవరకొండ నా పక్కన ఉండాల్సిందే”.. ఫ్యూజులు ఎగిరిపోయే మ్యాటర్ లీక్ చేసిన రష్మిక..!!

సినిమా ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీస్ కొంచెం ఫ్రెండ్షిప్ మైంటైన్ చేసినా కొంచెం సరదాగా గడిపిన వాళ్ళ మధ్య ఏదో ఉంది అంటూ వార్తలు వచ్చేస్తూ ఉంటాయి. ఇది ఇప్పటి విషయం కాదు కొన్ని తరతరాలుగా ఈ తంతు కొనసాగుతూనే వస్తుంది . అయితే గతంలో ప్రభాస్ అనుష్కలపై ఎలాంటి వార్తలు వినిపించాయో ఇప్పుడు విజయ్ దేవరకొండ రష్మిక మందన్నాలపై అలాంటి వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. రీసెంట్గా విజయ్-రష్మిక లు నిశ్చితార్ధం చేసుకోబోతున్నారు అన్న వార్తలు కూడా వినిపించాయి .

దీంతో రియాక్ట్ అయిన విజయ్ దేవరకొండ ..”జనాలకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు నా పెళ్లి ఎంగేజ్మెంట్ చేసేస్తూ ఉంటారు “అని ఫన్నీగా కామెంట్స్ చేశారు . రీసెంట్గా బాలీవుడ్ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక మందన్నా.. విజయ్ దేవరకొండ గురించి మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి . విజయ్ దేవరకొండ తో తన రిలేషన్షిప్ గురించి మాట్లాడుతూ రష్మిక సంచలన కామెంట్స్ చేసింది .” విజయ్ నాకు మంచి బెస్ట్ ఫ్రెండ్ ..ఇద్దరం కెరియర్ లో బాగా ఎదుగుతున్నాం.. నేను చేసే ప్రతి పనిలోనూ అతని సపోర్ట్ ఉంటుంది”.

“నేను చేసే ప్రతి మూవీ విషయంలోని అతని సలహా తీసుకుంటాను.. విజయ్ కి అన్నీ తెలుసు .. ఏ సినిమా చేస్తే హిట్ అవుతుంది ఏ సినిమా మన కెరీర్ కి ప్లస్ అవుతుంది అని .. ఏది మంచి ఏది చెడు అనేది విజయ్ క్లారిటీగా చెప్పేస్తాడు ..అందుకే నా వ్యక్తిగత జీవితం గురించి కూడా ఆయన సలహానే తీసుకుంటూ ఉంటాను ..ఆయనను గౌరవిస్తాను” అంటూ క్రేజీ మ్యాటర్ ని లీక్ చేసేసింది . ఈ మాటలు విన్న ఎవ్వరైనా సరే వీళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ కాదు అంతకుమించి అని అర్థం చేసుకోక తప్పదు. అయినా సరే వీళ్ళ మధ్య ఉన్న ప్రేమ వ్యవహారాన్ని ఎందుకు బయట పెట్టడం లేదో..ఆ దేవుడికే తెలియాలి . ప్రెసెంట్ రష్మిక – విజయ్ దేవరకొండ పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి..!!