రకుల్ ప్రీత్ వెడ్డింగ్ డెస్టినేషన్ లో కొత్త ట్విస్ట్‌.. ఏం జ‌రిగిందంటే..

టాలీవుడ్ స్టార్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్.. బాలీవుడ్ యాక్టర్ జాకీ భ‌గ్నాని వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసింది. 2021లో వీరిద్దరు ప్రేమలో ఉన్నారంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేసిన ఈ జంట.. కొంతకాలం ప్రేమాయడం తర్వాత.. తాజాగా ఈ ఏడాది ఫిబ్రవరి 22 పెళ్లి పీటలు ఎక్క‌నున్నారు. ఈ విష‌యం ఇప్పటికే సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. అయితే గతంలోనే వీరి వివాహ వేదికను కూడా సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ చేశారు అభిమానులు.

Why Rakul Preet, Jackky changed their wedding venue from abroad to India |  Bollywood - Hindustan Times

కాగా ఇప్పుడు వీరి వివాహ వేదిక విషయంలో మార్పులు జరిగినట్టు బాలీవుడ్‌లో ప్రచారం జరుగుతుంది. విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని ప్లాన్ లో ఉన్న ఈ జంట ఇటీవల వారి నిర్ణయాన్ని మార్చుకున్ని గోవాలో చేసుకునేందుకు ఫిక్స్ అయ్యారని సమాచారం. రకుల్ జాకీ భ‌గ్నాని మొద‌ట మిడిల్ ఈస్ట్‌లో పెళ్లి చేసుకోవాలని అనుకున్నారట. కానీ ప్రధాన నరేంద్ర మోడీ పిలుపుమేరకు ఇండియాలోనే చేసుకోవాలని నిర్ణయానికి వచ్చారని తెలుస్తుంది. చివరి నిమిషంలో వేదిక మార్చడం కష్టమే అయినా దేశంపై ఉన్న మక్కువతో ఈ మార్పులు వారు అంగీకరించారట.

M on X: "Rakul Preet Singh and Jackky Bhagnani Shift Wedding Destination To  India On PM Narendra Modi's Cal #RakulPreet #JackkyBhagnani #NarendraModi  #Wedding #MovieTalkies https://t.co/EGn73aNJWK" / X

రకుల్, జాకీ సన్నిహిత వర్గాల నుంచి ఈ సమాచారం అందుతుంది. విదేశాల్లో వివాహం చేసుకోవాలని భారతీయ యువ జంటలకు ప్రధాని మోడీ ఇటీవల పిలుపునిచ్చిన సంగ‌తి తెలిసిందే. తమ జీవితంలో నూతన ప్రయాణాన్ని విదేశాల్లో ఎందుకు ప్రారంభించాలి అంటూ ప్రశ్నించిన మోది.. భారత్‌లో ఒక్కసారైనా డెస్టినేషన్ వెడ్డింగ్ చేశారా అంటూ ప్రశ్నించాడు. అన్ని దేశాల్లో సంపన్న కుటుంబాల వారికి మేకిన్‌ ఇండియా తరహాలో వెడ్డింగ్ ఇండియా ప్రారంభం కావాలి అంటూ వివరించాడు. దీంతో విదేశాల‌లో వెడ్డింగ్ ప్లాన్ ఈ జంగ విర‌మించుకున్నార‌ట.