పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కబోతున్న అనుష్క శెట్టి.. ఫ్యాన్స్ కి ఊహించని షాక్ ఇది..ఏమైందంటే..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ట్రోలింగ్ అనేది ఎంత పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకటి కాదు రెండు కాదు ఆల్మోస్ట్ చాలామంది స్టార్ సెలబ్రిటీస్ ని ట్రోలింగ్ పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారు కొందరు ఆకతాయిలు. అయితే అది హద్దుల్లో ఉంటే అందరికీ మంచిదే ..హద్దులు దాటిపోతేనే చాలా చాలా ప్రమాదం. కొందరు స్టార్ సెలబ్రిటీస్ విషయంలో అది హద్దులు దాటిపోతుంది . అంతా ఇంత కాదు చెప్పుకోలేనంతగా . కుటుంబ సభ్యులు ఆ ట్రోల్స్ చూసి తట్టుకోలేకపోతున్నారు .

రీసెంట్గా అనుష్క శెట్టి సైతం అలాంటి ట్రోలర్స్ పై సివియర్ యాక్షన్ తీసుకోవడానికి సిద్ధపడినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అనుష్క శెట్టి ఇండస్ట్రీలో జేజమ్మగా బాగా పాపులారిటీ దక్కించుకుంది . ప్రజెంట్ సినిమాలకు దూరంగా ఉన్న అనుష్క శెట్టి క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. రీసెంట్గా అనుష్క శెట్టి ట్రోలర్స్-మీమ్‌రస్ పై యాక్షన్ తీసుకోవడానికి సిద్ధపడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి .

కొందరు ఆమెకు ప్రభాస్ కి పెళ్లి చేసి పిల్లలు పుట్టినట్టు కొన్ని ఫొటోస్ క్రియేట్ చేస్తున్నారు. అది ఓకే .. మరి కొందరు ఏకంగా ఆమె ఫొటోస్ ని పలువురు పెళ్లయిపోయిన హీరోస్ పక్కన క్రికెటర్స్ పక్కన మార్ఫ్ చేస్తూ అనుష్కకు పెళ్లి కాబోతుంది అంటూ దుష్ప్రచారం చేస్తున్నారట. దీంతో అనుష్క పేరెంట్స్ తీవ్రంగా హర్ట్ అయ్యారట . పెళ్లి కావాల్సిన ఆడపిల్లపై ఇలాంటి ట్రోలింగ్స్ కరెక్ట్ కాదు అంటూ బాధపడుతున్నారట . అందుకే పేరెంట్స్ బాధలు చూడలేక అనుష్క వాళ్ళపై సివియర్ యాక్షన్ తీసుకోవడానికి పోలీస్ కేసు పెట్టబోతుందట. ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది..!!