బాక్స్ ఆఫీస్ పోరుకు రెడీ అవుతున్న బాబాయ్ – అబ్బాయి.. డైలామాలో మెగా ఫ్యాన్స్..

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్‌ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా తన సత్తా చాటి గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. కాగా ఆర్ఆర్ఆర్ రిలీజై సంవత్సరాలు గడుస్తున్న ఇంకా మెగా హీరో నుంచి ఒక్క సినిమా కూడా వెండితెర‌పై రాలేదు. శంకర్ డైరెక్షన్‌లో రామ్‌చరణ్ గేమ్ చేంజెర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా అనివార్య‌ కారణాలతో షూటింగ్ డిలే అవుతూ వచ్చింది. దీంతో ఈ సినిమా ఈ ఏడాది కచ్చితంగా రిలీజ్ అవుతుందని చరణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Charan's Game Changer: No December, No Sankranthi

ఇప్పటికే కమలహాసన్ భారతీయుడు 3 సినిమా పై ఫుల్ ఫోకస్ పెట్టిన శంకర్.. గేమ్ చేంజర్‌ త్వరలో రిలీజ్ చేసేదిశ‌గా అడుగులు వేస్తున్నాడట. మరో పక్క దిల్ రాజు కూడా ఈ మూవీ సెప్టెంబ‌ర్‌లో తీసుకురావాలని తెగ ట్రై చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో మూవీ నుంచి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్ 27 లేక గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ మొదటివారంలో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి స‌న్నాభాలు జరుగుతున్నాయ‌ట‌. కాగా చెర్రీ మూవీ వస్తుంది అని ఆనందపడే టైంలోనే మెగా ఫాన్స్‌కు మారో షాక్ ఎదురయింది.

సెప్టెంబర్ 27 ధియేటర్ల పై దండయాత్రకు ఓజి సినిమాతో పవన్ కళ్యాణ్ కూడా రెడీ అవుతున్నాడు. ఇక ఈ ఊహించని పరిణామాలతో మెగా ఫాన్స్ కు పెద్ద షాప్ తగిలింది. అబ్బాయి సినిమా వచ్చే టైంకే బాబాయి పోటీగా రావడం కాస్త మెగా అభిమానంలో ఇబ్బందికర వాతావరణ నెలకొల్పింది. ఎన్నికల టైం కాబట్టి పవన్ చేతిలో ఉన్న సినిమాలన్నీ లేట్ అవుతాయని ప్రేక్షకులు భావించారు. కానీ 20 రోజులు తనకు కాల్ షీట్ ఇస్తే మూవీ పూర్తి చేస్తారని డైరెక్టర్ సుజిత్.. పవన్ ని కన్విన్స్ చేయడంతో పవన్ కళ్యాణ్ దీనికి ఓకే చేశారట.

AB George on X: "#PawanKalyan's next movie #OG shoot starts today in  Bombay… Helmed by Sujeeth (Run Raja Run & Saaho)... Music by Thaman...  #FireStormIsComing #TheyCallHimOG 🔥 https://t.co/HGRMHQtqQn" / X

షూటింగ్ ఎప్పుడు స్టార్ట్‌కానుంద‌నే అంశంపై స్పష్టత లేదు. కానీ మొత్తానికి ముందుగానే రిలీజ్ డేట్ ని మేకర్స్ లాక్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ సినిమాకు పెద్ద తలనొప్పిగా ఓజి మారనుంది. పోని రామ్ చరణ్ గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ మార్చడానికి.. ఆ తర్వాత నెల ఆగస్టులో బన్నీ పుష్పాది రూల్ రిలీజ్ అవుతుంది. సంక్రాంతి రావడంతో మరింత కష్టమౌతుంది. మెగాస్టార్ నెక్స్ట్ సంక్రాంతికి ఆల్రెడీ సినిమా రిలీజ్ పిక్స్ చేసుకున్నాడు. సమ్మర్ సీజన్‌లో దేవర ఉంది. మరోపక్క శంకర్ మరో మూవీ భారతీయుడు 3.. డేట్స్ కూడా ఇంకా ఫిక్స్ కాలేదు. ఈ నేపథ్యంలో చెర్రీ సినిమా ఎప్పుడు వస్తుంది అనే అంశం ప్రస్తుతం పెద్ద ప్రశ్నగామారింది.