‘ హనుమాన్ ‘ స‌క్స‌స్‌తో బంపర్ ఆఫర్ కొట్టేసిన ప్రశాంత్ వర్మ.. ఇప్పటివరకు రాజమౌళికి కూడా దక్కని ఆ అదృష్టం..

సినీ ఇండస్ట్రీలో అప్పుడప్పుడు కొన్ని మిరాకిల్స్ జరుగుతూ ఉంటాయి. తక్కువ బడ్జెట్ తో రిలీజై బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకోవడంతోపాటు.. కోట్లల్లో వసూళ్లను తెచ్చిపెట్టి మేకర్స్ ను లాభాల బాటలో నడిపిస్తూ ఉంటాయి. ఊహించిన దాని కంటే ఎక్కువ ఫలితాలను అందిస్తూ అద్భుతాలు సృష్టిస్తూ ఉంటాయి. ఇక‌ తాజాగా హనుమాన్ టీం అలాంటి సక్సెస్ అందుకుంది. సంక్రాంతి బ‌రిలో అతి చిన్న సినిమాగా తెర‌కెక్కిన హనుమాన్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకొని ఊహించని కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఇప్పటికే రూ.275 కోట్లకు పైగా గ్రాస్ కొల‌గొట్టిన ఈ సినిమా త్వరలోనే రూ.300 కోట్ల క్లబ్ లోకి చేరుకోనుంది.

Hanu Man Review | HanuMan Movie Review: Blending Indian ...

ఇక ఈ సినిమాతో హిట్ కొట్టిన ప్రశాంత్ వర్మ ఫేట్ పూర్తిగా మారిపోయిందని చెప్పాలి. ఇప్పటివరకు టాలీవుడ్‌లో చిన్న డైరెక్ట‌ర్‌ల లిస్టులో ఉన్న ప్రశాంత్‌ ఒక్కసారిగా పాన్ ఇండియా డైరెక్టర్‌గా మారిపోయాడు. అంతేకాదు పలు ప్రముఖ నిర్మాణ సంస్థలు ప్రశాంత్ వర్మ‌కు అడ్వాన్స్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని సమాచారం. తన సినిమాకు రూ.100 కోట్ల బడ్జెట్ మాత్రమే కాదు ఏకంగా వెయ్యి కోట్ల బడ్జెట్ కూడా పెట్టడానికి కొంతమంది మేకర్స్ రెడీ అవుతున్నారట. ఈ విషయాన్ని స్వయంగా ప్రశాంత్ వర్మ ఓ ఇంటర్వ్యూలో వివరించాడు.

హనుమాన్ తర్వాత నాకు 100,200 కోట్లు బడ్జెట్ తో సినిమా చేసే ఆఫర్లు ఎన్నో వచ్చాయి. అంతే కాదు వెయ్యి కోట్ల ఆఫర్ కూడా వ‌చ్చిందంటూ చెప్పుకొచ్చాడు. హనుమాన్ మూవీ చూసిన ఓ ఎన్ఆరై నాకు ఈ ఆఫర్ ఇచ్చారు. మన ఇతిహాసాలలో ఇలాంటి సినిమా చేస్తానంటే వెయ్యి కోట్లు పెట్టడానికి కూడా నేను రెడీ అంటూ చెప్పుకొచ్చారని.. కానీ స్వతహాగా నాకు బడ్జెట్ కంటే.. ఇచ్చిన బడ్జెట్‌కు మించిన క్వాలిటీ చూపించడమే ముఖ్యం. బడ్జెట్‌లో సినిమా తీసే డైరెక్టర్‌ నేను కాదు ఆ విషయం మొదట్లోనే నేను నిర్మాతలకు చెప్పేస్తాను.

RRR- When a boy who dreams of working with Baahubali director SS Rajamouli  starts hating him

ఒక రూ.10 కోట్ల బడ్జెట్ తో సినిమా తీస్తే దానికి రూ.50 కోట్ల సినిమాల చూపించడం నాకు అలవాటు. రూ.40కోట్లతో తీస్తే దాన్ని రూ.150 కోట్ల సినిమాల చూపిస్తా. మార్కెట్‌ను అంచనా వేసుకుని సినిమాలు తెర‌కెక్కిస్తా అంటూ ప్రశాంత్ వర్మ వివరించారు. వెయ్యి కోట్ల ఆఫర్ ఇప్పటివరకు రాజమౌళికి కూడా రాలేదు. కానీ ఒక్క సినిమాతో ప్రశాంతవర్మ‌కు ఆ రెంజ్‌లో ఆఫర్లు రావడం అనేది సాధారణ విషయం కాదు. ఒకవేళ ప్రశాంత్ వర్మ అంత పెద్ద బడ్జెట్‌లో సినిమా తెరకెక్కిస్తే అది కచ్చితంగా రూ.2000 కోట్లు వసూళ‌ను రాబడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు అంటూ నెట్టిజ‌న్స్‌ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.