అందం కోసం ఎలాంటి సర్జరీలు చేయించుకున్నా తప్పులేదు.. స్టార్ బ్యూటీ సెన్సేషనల్ కామెంట్స్..

మాజీ మిస్ వరల్డ్.. మిస్ ఇండియా మానుషి చిల్లర కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నటిగా భారీ పాపులారి అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ మొదట సామ్రాట్ పృథ్వీరాజ్ లో కనిపించింది. అయితే ఈ సినిమా ఊహించనిలో సక్సెస్ అందించలేదు. గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ కూడా నిరాశనే మిగిల్చింది. అయినా ఈమె ప్రయత్నాలు ఆపలేదు. మరిన్ని కొత్త అవకాశాలను అందుకుంటు సినిమాల్లో నటిస్తూనే ఉంది. టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలో నటిస్తున్న మానుషి.. ప్రస్తుతం మెగా ప్రిన్స్‌ వరుణ్ తేజ్ సరసన ఆపరేషన్ వాలంటైన్ సినిమాలో కనిపించనుంది. మరో రెండు, మూడు సినిమాలలో ఈ ముద్దుగుమ్మ నటిస్తుంది.

Manushi Chhillar to Make Her London Fashion Week Debut in Rocky Star |  Manushi Chhillar to Make Her London Fashion Week Debut in Rocky Star

ఇక ఈ సినిమాల్లో బిజీగా ఉంటూనే మరో పక్క సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ కు హాట్ ట్రీట్ ఇస్తూనే ఉంటుంది. ఫ్యామిలీ వెకేషన్స్, నేచ‌ర్ ఎంజాయ్ చేస్తున్న పిక్స్ ను మానుషి తన సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటుంది. మోడలింగ్లో ఓ వెలుగు వెలిగిన‌ అందాల భామ హాట్ అందాల ఆరబోతలో ఏమాత్రం వెనకడుగు వేయ‌లేదు. అయితే తాజాగా ఈ అమ్మడు అందం గురించి ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. మిస్ వరల్డ్ 2024 ఫ్రీ లంచ్ కి హాజరైన ఈ అమ్మడు అందం కోసం ఎంతకైనా తెగించవచ్చు.. అందులో తప్పేం లేదు అంటూ కామెంట్స్ చేస్తుంది.

EXCLUSIVE: Manushi Chhillar on her Beauty Pageant Moments: Told parents I  was missing college for Miss India | PINKVILLA

కొన్ని వందల సంవత్సరాల క్రితమే సౌందర్య నిపుణులు ఉన్నారని ఎంతమందికి తెలుసు.. అందానికి ప్రాధాన్యత అప్పటినుంచి మొదలైంది. ఇప్పుడు మనమంతా అందం గురించి మాట్లాడుకుంటున్నాం.. దానికి కారణం కూడా వాళ్లే. అందం విషయంలో ఎవరు ఇష్టం వారికి ఉంటుంది. అందుకోసం ఎలాంటి సర్జరీలు చేసుకున్న అందులో తప్పు ఉండదు. బ్యూటీ కోసం సర్జరీ చేయించుకోవడం తప్పు అంటూ మాట్లాడడం స‌రికాదు అది వారి పర్సనల్ విషయం. మన ఆనందం ఎదుటివారిని ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలు. మనం ఎంత స్వేచ్ఛగా ఉన్నా ఇబ్బంది లేదు అంటూ అందం కోసం ఏవేవో సర్జరీ చేయించుకుంటున్న వారి గురించి పాజిటివ్ కామెంట్స్ చేసింది.