వావ్.. బాలయ్య తన సొంత పేరుతో ఏకంగా ఇన్ని సినిమాల్లో నటించాడా.. ఆ సినిమాల లిస్ట్ ఇదే..

నందమూరి నట‌సింహం బాలకృష్ణ ప్రస్తుతం సీనియర్ స్టార్ హీరోగా వరుస‌ సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల భగవంత్ కేసరి సినిమాతో హ్యాట్రిక్ హిట్ తన ఖాతాలో వేసుకున్న బాలయ్య.. ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తన 109 వ సినిమాలో నటిస్తున్నాడు. ఇక తన 49 ఏళ్ల సినీ కెరీర్‌లో 100కు పైగా సినిమాల్లో నటించి క్రేజ్‌ను సంపాదించుకున్న బాలకృష్ణ.. ఇప్పటికీ హ్యాట్రిక్ హిట్లు కొడుతూ.. యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ దూసుకుపోతున్నాడు. ఇక బాలకృష్ణ బాల్యమంతా హైదరాబాదులోనే గడిచింది. తన చిన్నప్పటి నుంచి బాల నటుడుగా ఎన్నో సినిమాల్లో నటించిన బాలయ్య.. హైదరాబాదులోనే బిఏ కంప్లీట్ చేసి.. తర్వాత నటన రంగంలో పూర్తిస్థాయిలో మెప్పిస్తున్నాడు.

Hemanth🇮🇳🇺🇸 on X: "#NBK9 Movie : ROWDY RAMUDU KONTE KRISHNUDU Role : BALAKRISHNA Director : K. RAGHAVENDRA RAO #HappyBirthdayNBK 🦁 https://t.co/sG5LsEavAP" / X

అయితే ఇప్పటివరకు బాలకృష్ణ నటించిన సినిమాలలో తన సొంత పేరుతో ఏకంగా డు సినిమాలలో నటించాడు. అలా బాలకృష్ణ వ‌టించిన తొలి సినిమా తాతమ్మ కలలో కూడా ఆయన సొంత ఫేరుతో న‌టించాడు. ఈ సినిమా షూటింగ్ టైంలో బాలకృష్ణ తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు. ఇక‌ ఈ సినిమా తర్వాత 1980లో వచ్చిన రౌడీ రాముడు కొంటె కృష్ణుడు సినిమాలో కూడా బాలకృష్ణ తన సొంత పేరుతో నటించాడు. అలాగే సింహం నవ్వింది, డిస్కో కింగ్, బంగారు బుల్లోడు, మహారధి, పైసా వసూల్ ఇలా ఈ సినిమాల‌న్నింటిలోనూ బాలకృష్ణ తన సొంత పేరు తోనే నటించి మెప్పించాడు.

Bangaru Bullodu (1993 film) - Wikipedia

ఇక ఈ సినిమాలన్నీ మిశ్రమ ఫలితాలు దక్కించుకున్నాయి. కొన్ని బ్లాక్ బస్టర్ హిట్లు కాగా.. కొన్ని కమర్షియల్ హిట్ గా నిలిచి సక్సెస్ అందుకున్నాయి. ఇక ప్రస్తుతం బాలయ్య నటిస్తున్న తన 109వ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. యంగ్ డైరెక్ట‌ర్‌ బాబీ ఈ సినిమాకు ముందు చిరంజీవికి వాల్తేరు వీరయ్య సినిమాతో భారీ బ్లాక్ బ‌స్టర్ అందించాడు. అదే రేంజ్ లో బాలయ్య సినిమా కూడా రూపొందుతుంది అంటూ అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే హ్య‌ట్రీక్‌ హీట్లతో దూసుకుపోతున్న బాలయ్య కూడా కంటెంట్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు.

Paisa Vasool Movie Review NBK101 Paisa Vasool Review