హిట్ డైరెక్టర్లతో నితిన్ క్రేజీ లైన్ అప్.. కొత్త ఫార్ములా వర్కౌట్ చేయ‌నున్న యంగ్ హీరో..?

టాలీవుడ్ యంగ్‌ హీరో నితిన్ ఇటీవల కాలంలో వరుస ఫ్లాపులతో సతమతమైన సంగతి తెలిసిందే. దీంతో అప్ కమింగ్ సినిమా విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు ఈ యంగ్ హీరో. ఈసారి సక్సెస్ కోసం కొత్త ఫార్ములా ను ప్లాన్ చేసిన నితిన్.. ఈ ఫార్ములా వర్క్ అవుట్ అయి సక్సెస్ అందుకుంటాడో లేదో చూడాలి. ఇంత‌కి ఈ ఫార్ములా ఏంటో ఓ సారి చూద్దాం. గతంలో మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్.. రెండు సినిమాలతో వరుస ఫ్లాప్‌లను ఎదుర్కొన్న నితిన్.. ప్రయోగాత్మక సినిమాల జోలికి పోకుండా కథ‌ల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ అడుగులు వేస్తున్నాడు.

ప్రస్తుతం తమ్ముడు సినిమాలో నటిస్తున్నాడు నితిన్. ఇక వకీల్ సాబ్ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత.. వేణు శ్రీరామ్ తెర‌కెక్కిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. దీనికి తోడు నితిన్‌కు బాగా కలిసొచ్చిన పవన్ కళ్యాణ్ టైటిల్.. ఈ సినిమాకు రిపీట్ చేస్తుండడంతో ఈ సినిమాపై పాజిటివ్ వైబ్స్‌ కూడా క్రియేట్ అయ్యాయి. అలాగే రీసెంట్‌గా రాబిన్ హుడ్ తో మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు నితిన్. గతంలో తనకు భీష్మతో బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్టర్ ఇచ్చిన వెంకి కుడుముల కాంబినేషన్లో ఈ సినిమా తెరకెక్కనుంది.

ఇక ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా రిలీజ్ అయిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే మరో హిట్ డైరెక్టర్ కు నితిన్ ఓకే చెప్పారని న్యూస్ వైరల్ అవుతుంది. ఇటీవల డిజిటల్ సూపర్ హిట్ అయినా 90స్‌ మిడిల్ క్లాస్ బయోపిక్.. దర్శకుడు ఆదిత్య హాసన్ కు నితిన్ ఓకే చెప్పాడట. ప్రస్తుతం డిస్కషన్ స్టేజ్ లో ఉన్న ఈ ప్రాజెక్ట్ పై త్వరలోనే క్లారిటీ రానుంది. ఇక ప్రస్తుతం హిట్ డైరెక్టర్లను లైన్లో పెట్టిన నితిన్ కు ఈ కొత్త ఫార్ములా అయినా వర్కౌట్ అవుతుందో లేదో వేచి చూడాలి.