గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నితిన్ బ్యూటీ.. సడన్ గా ఈ మార్పు ఎందుకంటే.. ?

నాచురల్ స్టార్ నాని నటించిన అలా మొదలైంది సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది యంగ్ బ్యూటీ నిత్యామీనన్. ఆ తర్వాత ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, నితిన్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, శ‌ర్వానంద్‌, సూర్య లాంటి ఎంతోమంది స్టార్ హీరోలతో నటించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను ఏర్పరచుకుంది. నటనతో తన సత్తా చాటుకున్న ఈ ముద్దుగుమ్మ.. చివరగా తీరు సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న‌ నిత్యామీనన్.. ఇటీవల తాజాగా వెబ్ సిరీస్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నటిస్తోంది. అలాగే పలు సినిమాలను ఆఫర్లు దక్కించుకున్న ఈ చిన్న‌ది.. తెలుగుతోపాటు తమిళ, మలయాళ భాషల్లోనూ సినిమాల్లో నటిస్తోంది.

అయితే టాలీవుడ్‌లో నితిన్‌తో కలిసి నటించిన సినిమాల ద్వారా నిత్యా మీన‌న్‌కు భారీ పాపులారిటీ వచ్చింది. వీరిద్దరూ రెండు మూడు సినిమాలలో వరుసగా నటించడంతో.. అప్పట్లో వీరు లవ్ చేసుకుంటున్నారు అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. అయితే దీన్ని ఇద్దరు ఖండించారు. ఇక కొంతకాలం క్రితమే హీరో నితిన్‌కు వేరే అమ్మాయితో వివాహం జరిగిన సంగ‌తి తెలిసిందే. నిత్య మీనన్ విషయానికొస్తే.. ఎప్పటికప్పుడు సినిమాల ద్వారా తన క్రేజ్‌ మరింతగా పెంచుకుంటూన్న ఈ మ్యూటీ తాజాగా ఓ ఫోటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవ్వడంతో.. అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఒక్కసారిగా పెళ్లికూతురు గెటప్ లో నిత్యామీనన్ దర్శనమిచ్చింది. అయితే ఈ ఫోటోలలో నిత్య పెళ్లికూతురు గెటప్ లో బెడ్ పై కూర్చుని బాధపడుతున్నట్లుగా కనిపించింది. ఈ పిక్స్ తను నెక్స్ట్ మూవీ సమాప్తికి సంబంధించిన పోస్టర్స్ అంటూ వివరించింది. సమాప్తి సినిమాలో మృణ్మయీ పాత్రలో నిత్యా నటిస్తుందట‌. ఓ యువతీ ప్రేమ కథ ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కుతున్నట్లు సమాచారం. గతంలో సత్యజిత్రే ఠాగూర్ చిన్నా కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట. అయితే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాలంటే కొంతకాలం వేచి చూడక తప్పదు.