అయ్యయ్యో ..పాపం.. అవార్డుల వేడుకలో మృణాల్‌ ఠాకూర్ కి ఘోర అవమానం.. లైఫ్ లో మర్చిపోలేనిది..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మృణాల్ ఠాకూర్ కి ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. మొదట సీరియల్స్ లో నటించి ఆ తర్వాత బాలీవుడ్ సినిమాల్లో నటించి క్రేజ్ సంపాదించుకున్న మృణాల్ ఠాకూర్ సీతారామం సినిమా ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయింది .

ప్రజెంట్ మృణాల్ ఠాకూర్ పలు తెలుగు బాలీవుడ్ సినిమాలతో బిజీగా ముందుకెళ్తుంది. రీసెంట్గా మృణాల్ ఠాకూర్ కు ఘోర అవమానం ఎదురయింది . బాలీవుడ్ లో జరిగిన ఒక అవార్డుల వేడుకలో తనకు చేదు అనుభవం ఎదురయింది అంటూ మృణాల్ స్వయంగా బయట పెట్టడం గమనార్హం . ఆ వేడుకలో మృణాల్ దగ్గర కొందరు మీడియా ప్రతినిధులు ఇంటర్వ్యూ తీసుకుంటూ ఉన్నారట .

సడన్గా అక్కడికి ఒక పెద్ద స్టార్ హీరో కొడుకు వచ్చాడట . అంతే మీడియా వాళ్ళు మృణాల్ ఇంటర్వ్యూని మధ్యలో ఆపేసి పరిగెత్తుకుంటూ స్టార్ వద్దకు వెళ్లిపోయారట . ఈ విషయం తనని హర్ట్ చేసింది అంటూ చెప్పుకు వచ్చింది. నెపోటిజం అని అందరూ అంటుంటారు ..స్టార్ కిడ్స్ ని నిందిస్తూ ఉంటారు . నిజానికి వాళ్ళ తప్పు ఏమీ లేదు.. నెపోటిజం అనేది స్టార్ కిడ్స్ తప్పు కాదు. ప్రతి ఒక్క ఆడియన్స్ స్టార్ కిడ్స్ గురించి తెలుసుకోవాలనుకుంటా ఉంటారు.. దీంతో మీడియా ఆ వార్తలనే రాయడానికి ఉత్సాహపడుతూ ఉంటుంది .. అదే వాళ్ళు చేసే తప్పు అంటూ తనకు ఎదురైన అవమానాన్ని ఓపెన్ గా చెప్పుకొచ్చింది . ప్రజెంట్ ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి..!!