‘ విశ్వంభరా ‘ కోసం అలాంటి పని చేస్తూ చెమటలు చిందిస్తున్న మెగాస్టార్.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

మెగాస్టార్ చిరంజీవి పాన్ ఇండియా మార్కెట్ టార్గెట్ చేస్తూ నటిస్తున్న మూవీ విశ్వంభ‌ర‌. బింబిసారా డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సర్వే గంగా జరుగుతుంది. బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ మొదలుకాక ముందు నుంచే భారీ హైప్ నెలకొంది చిరు కెరీర్‌లో అంజి, జగదేకవీరుడు అతిలోకసుందరి లాంటి జానెర్ల తర్వాత పూర్తిస్థాయి ఫాంటసీ డ్రామాగా తెరకెక్కుతున్న సినిమా కావడంతో విశ్వంభరా సినిమా కోసం ప్రేక్షకులు ఆశ‌క్తిగా ఎదురుచూస్తున్నారు. పంచభూతాలు.. అన్ని ఎలిమెంట్స్‌ని మిక్స్ చేసి సాలిడ్ కంటెంట్ తో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం.

విశ్వంభ‌ర యాక్షన్ కొరియోగ్రఫీ డిస్కషన్స్ ప్రారంభమయ్యాయని సమాచారం. ఇటీవల మూవీ యూనిట్ నుంచి వచ్చిన ఈ అప్డేట్ మెగా అభిమానులకు ఆనందాన్ని కలుగజేస్తుంది. దీని రెట్టింపు చేస్తూ సాలిడ్ కిక్ ఇచ్చేలా చిరంజీవి తన లేటెస్ట్ ఫోటోలను అప్డేట్ చేశాడు. ఎంతో కష్టపడుతూ జిమ్లో వర్కౌట్ చేస్తూ చెమటలు చిందిస్తున్న చిరు పిక్స్ ప్రస్తుతం వైరల్గా మారాయి. 68 ఏళ్ల వయసులో కూడా సినిమా కోసం జిమ్ కి వెళ్లి వర్కౌంట్లో చేయడం అంటే అది సాధారణ విషయం కాదు. ఆ డెడికేషన్ వల్లే ఆయన మెగాస్టార్ అయ్యారు అంటూ నెట్టింట‌ కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఇక చిరూ వర్కౌట్లు చేస్తూ దిగిన ఫోటోలను స్వయంగా త‌న‌ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ విశ్వంభరా కోసం రెడీ అవుతున్నట్లు వివరించాడు. ఫిట్నెస్ పై దృష్టిపెట్టిన చిరంజీవి ఇప్పుడు ఈ సినిమాలో కంప్లీట్ డిఫ‌రెంట్‌గా కనిపించనున్నారట. చిరు మామూలుగానే కాస్త ఫీట్ గా కనిపిస్తాడు. ఎప్పుడు ఎక్కువగా లావుగా కనిపించలేదు. అలాంటిది ఫిట్నెస్ పై మరింత ఫోకస్ పెడితే చిరు ఎంత సాలిడ్గా మారతాడో అర్థం చేసుకోవచ్చు. జెట్ స్పీడ్ లో ప్రస్తుతం విశ్వంభరా షూటింగ్ జరుగుతుంది. 2025 సంక్రాంతి సీజన్ టార్గెట్ చేస్తూ చిరు విశ్వంభరా రిలీజ్‌కానుంది. ఎలాంటి డిలేస్ లేకపోతే విశ్వంభరా జనవరి 10 కల్లా ప్రేక్షకుల ముందుకు రానుందట.