రాజమౌళి పై మరోసారి ప్రశంసలు కురిపించిన ‘ జేమ్స్ కామెరున్ ‘.. అలాంటి ఆలోచన నాకెందుకు రాలేదని బాధపడ్డా..

ఆర్‌ఆర్ఆర్ సినిమాతో దర్శకధీరుడు రాజమౌళికి ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి క్రేజ్ వచ్చిందో అందరికీ తెలుసు. నాటునాటు సాంగ్‌కి ఆస్కార్ అవార్డును అందుకోవడంతో రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, కీరవాణిల పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఈ నేపథ్యంలో ప్రపంచ ప్రఖ్యాత డైరెక్టర్లు, స్టార్ సెలబ్రిటీలు ఎంతోమంది ఆర్ఆర్ఆర్ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. జేమ్స్ కామెరున్, స్టీవెన్ స్పిల్‌బ‌ర్గ్ లాంటి వాళ్లు కూడా ఆర్‌ఆర్ఆర్ సినిమాని అభినందించడం గమనార్హం. కాగా జేమ్స్ కామెరున్ ఆర్‌ఆర్ఆర్ మూవీ చూస్తు చాలా సందర్భాల్లో తాను సీట్లో నుంచి పైకి లేచినట్లు తన సంతోషాన్ని స్వయంగా రాజమౌళితో షేర్ చేసుకున్నాడు.

అనేక ఇంటర్వ్యూలో కూడా రాజమౌళిని అభినందించిన ఆ స్టార్ డైరెక్టర్.. మరోసారి అవతార్ సృష్టికర్త రాజమౌళి పై ప్రశంసలు కురిపించాడు. హాలీవుడ్ లో జరిగిన 51 వ సాటనర్ అవార్డుల వేడుకలో పాల్గొన్న కామ‌రున్‌ మాట్లాడుతూ రాజమౌళిని ప్రశంసించాడు. మీరు ఎవరిని చూసి స్ఫూర్తిని పొందాలనుకుంటారు అని జేమ్స్ కామెరున్‌కు ప్రశ్న ఎదురుకాగా.. తాను ప‌లు సందర్భాల్లో చాలా మందిని చూసి పూర్తి పొందుతానని వివరించాడు. ఉదాహరణకు స్పీల్ బ‌ర్గ్‌.. ఆయ‌న వర్క్ ఎప్పటికప్పుడు కొత్తగా కనిపిస్తుంది అంటూ వివరించాడు. ఇక కొత్తగా వస్తున్న దర్శకులకు వస్తున్న ఆలోచనలు నాకెందుకు రావడం లేదు అని ఒక్కోసారి బాధపడుతూ ఉంటా అంటూ వివరించాడు జేమ్స్.

ఆర్ఆర్ఆర్ సినిమా చూసినప్పుడు చాలా అద్భుతంగా ఫీలయ్యానని.. రాజమౌళి తన వర్క్‌తో ప్రపంచం మొత్తం ఆకట్టుకునేలా సినిమాలు తెరకెక్కించాడని వివరించాడు. ఇండియా సినిమా వరల్డ్ వైడ్గా సత్తా చాటడం చాలా గొప్ప విషయం అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో జేమ్స్ కామెరున్ రాజమౌళి పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. జక్కన్న ఈసారి వరల్డ్ బాక్సాఫీస్ టార్గెట్ చేస్తూ మహేష్ బాబుతో పాన్ వర‌ల్డ్ సినిమా తెర‌కెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో అని ఆసక్తి ప్రపంచవ్యాప్తంగా అందరి ప్రేక్షకులను నెలకొంది.