థియేటర్లలో రిలీజ్ కాకుండానే డైరెక్ట్ ఓటీటీలోకి వచ్చేస్తున్న అ స్టార్ హీరో మూవీ.. షాక్ లో అభిమానులు..

కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. రెమో సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన ఈ యంగ్ హీరో.. ఇటీవల రకుల్ ప్రీత్ తో కలిసి అయ్యలన్ సినిమాలో నటించాడు. రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా తమిళ్, తెలుగులో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ గతంలో అనౌన్స్‌ చేశారు. అయితే తమిళ్ భాషలో సినిమా రిలీజై బ్లాక్ బస్టర్ అందుకుంది.

ఏవో కారణాలతో టాలీవుడ్ లో ఈ సినిమా ప్రమోషన్స్ జరిగినప్పటికీ.. థియేటర్లో రిలీజ్ కాలేదు. ఇదిలా ఉంటే డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ ద‌క్కించుకున్న‌ట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. స్ట్రీమింగ్ తేదీ అధికారికంగా ప్రకటించలేదు.. అయినా ఈ వార్తలు వైరల్ అయ్యాయి. కాగా తాజాగా ఈ మూవీ అభిమానులకు.. సన్ నెక్స్ట్ గుడ్ న్యూస్ చెప్పింది.

ఫిబ్రవరి 9 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానునట్లు ట్విటర్ వేదికగా ప్రకటించింది. తమిళ్, తెలుగు భాషల్లో అందుబాటులోకి సినిమా రానున్నట్లు సమాచారం. అయితే థియేటర్స్ లోకి రాకముందే శివ కార్తికేయన్.. ఆయాలన్‌ తెలుగులో కూడా స్ట్రీమింగ్ కానుంది అని తెలియడంతో ప్రేక్షకులు నిరాశ చెందుతున్నారు. మరి కొంతమంది మాత్రం ఓటీటీలో త్వరగా తమ ఫేవరెట్ హీరో సినిమాను చూసేయొచ్చని ఆనందపడుతున్నారు.