అమ్మతనానికి నోచుకున్న దీపిక పదుకొనే.. వైరల్ గా మారిన పోస్ట్..!

ప్రస్తుత కాలంలో స్టార్ హీరోయిన్స్ అందరూ తమ ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేస్తూ తమ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెబుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇదే బాటలో మరో స్టార్ హీరోయిన్ కూడా నడిచింది. ఆమె దీపికా పదుకొనే.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఎదిగిన ఈ ముద్దుగుమ్మ రీసెంట్ గా తన ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేసింది. గత కొంతకాలంగా ఈమె ప్రెగ్నెన్సీ పై అనేక వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఆ పుకార్లకు ముగింపు పలుకుతూ దీపిక పదుకొనే తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా తాను మరియు తన భర్త సెప్టెంబర్ 2024లో తమ మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నట్లు ఓ పోస్టర్ ద్వారా వెల్లడించింది.

ఇక ఈ న్యూస్ చూసిన దీపికా పదుకొనే అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ప్రస్తుతం దీపిక పదుకొనే కల్కి మూవీలో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ సర్వేగంగా జరుగుతుంది. ఇక ప్రస్తుతం దీపికా పదుకొనే పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.