వాట్.. మహేష్ బాబు యాడ్స్ కు డబ్బింగ్ చెప్పేది ఆ జబర్దస్త్ కమెడియనా.. అసలు ఊహించని ట్విస్ట్..

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే పాన్ వ‌ర‌ల్డ్ ద‌శ‌గా అడుగులు వేస్తున్న మహేష్ బాబు.. ఇప్పటికే ఎన్నో కమర్షియల్ యాడ్స్ లో నటించాడు. సినిమాలతో కంటే యాడ్స్ ద్వారానే మహేష్ బాబు సంపాదన ఎక్కువగా వస్తుందని సమాచారం. అయితే మహేష్ బాబు తనకి డబ్బింగ్ చెప్పు కొడట‌. అయిన నటించే యాడ్స్‌కు జబర్దస్త్ లో స్టార్ కమెడియన్‌గా క్రేజ్‌ సంపాదించుకున్న ఓ వ్యక్తి డబ్బింగ్ చెప్తాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక తాజాగా మహేష్ బాబు గుంటూరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇది ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయలేకపోయింది. యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇక ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో మొదటిసారి మహేష్ బాబు పాన్ వరల్డ్ సినిమాలో నటించబోతున్నాడు.

ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి రాకముందే ప్రేక్షకుల్లో సినిమాపై మంచి హైప్ నెలకొంది. ఇక సినిమాలతో మ‌రోప‌క్క యాడ్స్ కూడా నటిస్తూ సంపాదిస్తున్న మహేష్.. ఇటీవల ఫోన్ పై యాడ్ ద్వారా కోట్లు సంపాదించాడట. అలా సంతూర్, బైజుస్, థమ్స్ అప్, డ్యూక్, మసాలా, పర్ఫ్యూమ్‌లు, జ్యూవెల‌రీ, రియల్ ఎస్టేట్లో ఇలా చాలా రకాల యాడ్స్ ద్వారా సంపాదిస్తూనే ఉన్నాడు. అయితే ఆ యాడ్స్ లో కొన్నిటికి మాత్రమే మహేష్ బాబు స్వయంగా డబ్బింగ్ చెప్తాడట. చాలా వరకు ఇతరులతోనే డబ్బింగ్ చేయిస్తారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఓ ఇంట్రెస్టింగ్ విషయం నెటంట‌ వైరల్ గా మారింది. మహేష్ యాడ్స్ కు చాలా వరకు జబర్దస్త్ కమెడియన్ బుల్లెట్ భాస్కర్ డబ్బింగ్ చెప్తాడంటూ తెలుస్తుంది. ప్రస్తుతం ఈయన జబర్దస్త్ లో పాపులర్ కమీడియ‌న్‌గా రాణిస్తున్నాడు.

విలక్షమైన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే భాస్కర్ లో ఈ యాంగిల్ కూడా ఉందా.. కేవలం కామెడీ కాదు డబ్బింగ్ చెప్పడం వల్ల కూడా డబ్బులు సంపాదిస్తున్నాడ.. అది కూడా మహేష్ బాబు లాంటి స్టార్ హీరో వాయిస్ డబ్బింగ్ చెప్తున్నాడు అంటూ అంతా షాక్ అవుతున్నారు. స్వయంగా మహేష్ బాబు కూడా తన వాయిస్ అచ్చు దింపినట్టు మాట్లాడడం చూసి షాక్ అయ్యాడట. ఈ విషయాన్ని బుల్లెట్ భాస్కర్ ఇటీవల ఇంటర్వ్యూలో ఓ వివరించాడు. భాస్కర్ వాయిస్ విని మహేష్ తన టీం తో ఆనందాన్ని వ్యక్తపరిచార‌ని వెల్లడించాడు. ఇక ఆ ఇంటర్వ్యూలో తను మరోసారి మహేష్ వాయిస్ తో మాట్లాడి వినిపించాడు. అయితే ఇప్పటివరకు స్వయంగా మహేష్ బాబుని ఒక్కసారి కూడా కలిసే అవకాశం రాలేదని.. ఓసారి కేవలం ఫోటో మాత్రం తీసుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.