బాలయ్య అభిమానులకు బిగ్ షాక్.. ఏం జరిగిందంటే..?

నందమూరి నట‌సింహ బాలకృష్ణ ప్రస్తుతం వరుస సూపర్ హిట్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. యంగ్ హీరోలకు గట్టి పోటీ చేస్తున్న బాలయ్య 60 ఏళ్ళు దాటిన ఇంకా తగ్గేదేలే అంటూ హ్యాట్రిక్ హిట్లు అందుకుంటున్నాడు. ముందు ముందు సినిమాలపై కూడా మంచి బిజీ లైన‌ప్‌ ఏర్పాటు చేసుకున్న ఈయన దర్శకుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. మరో హ్యాట్రిక్ హిట్ దిశగా దూసుకుపోతున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన బాబి డైరెక్షన్లో తన 109వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నెక్స్ట్ సినిమాకు సంబంధించిన అప్డేట్ కూడా త్వరలోనే రానుంది. ఈ నేపథ్యంలో బాలయ్య కు సంబంధించిన ఓ న్యూస్ తెగ చెక్కెర్లు కొడుతుంది. వరుస హ్యాట్రిక్ హిట్ల నేపథ్యంలో బాలయ్య నెక్స్ట్ సినిమా ఎప్పుడు వస్తుందా అంటూ ఎదురుచూసే ప్రేక్షకులకు బాలయ్య పెద్ద షాక్ ఇచ్చినట్లయ్యింది.

Exclusive: Sithara on the Hunt for Balayya

బాలకృష్ణ నెక్స్ట్ రెండు నెలలు షూటింగ్ కు లాంగ్ బ్రేక్ ఇవ్వబోతున్నాడని తెలుస్తుంది. ఎలక్షన్ నేప‌ధ్యంలో ఎన్నికల్లో నోటిఫికేషన్ రిలీజ్ కానుండగా.. ప్రచారం కోసం ఈ రెండు నెలలు సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతున్నాడట. ఇక ఇప్పటికే బాలయ్య హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న సంగతి తెలిసిందే. అక్కడి నుంచే మరోసారి పోటీ చేయబోతున్నాడు ఈ సీనియర్ హీరో. ఏపీలో తన పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా కార్యక్రమాలు చేయనన్నాడు. దీనికోసం బాలయ్య రాష్ట్రమంతా తిరిగి అవకాశం ఉండడంతో ఆయన అన్ని షూటింగ్స్ కు కొంతకాలం బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడట. అయితే అప్ప‌టివ‌ర‌కు మేక‌ర్స్ ఇబ్బంది పడకుండా బాలయ్య లేని సన్నివేశాలను షూట్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకుంటున్నారట. ఏదేమైనా ఈ సినిమా ఈ ఏడాది దసరా రేస్‌లో థియేటర్లలోకి రానుందని తెలుస్తోంది. కాగా మొదట అనుకున్న బడ్జెట్ కన్నా బాలయ్య – బాబి కాంబిలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు బడ్జెట్ మరింతగా పెరుగుతుందని టాక్‌.

Balayya turns rapper, to introduce Telugu Indian Idol 2 contestants with a  5.5 minute song I Exclusive - India Today

వరుస హిట్ల నేపథ్యంలో ఈ సినిమా విషయంలో సితార ఎంటర్టైన్మెంట్ ప్రొడ్యూసర్లు కూడా ఏమాత్రం వెనకడుగు వేయడం లేదట‌. ఇక బాలయ్యకు మాస్ మూవీ అంటే ఏ రేంజ్ లో హిట్ అందుతుందో తెలిసిందే. ఈ జాన‌ర్‌లోనే బాబి సినిమా కూడా రానుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల అందరిలో నిర్హాత‌ల‌కు ఇబ్బంది కలగకుండా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నేది కేవలం బాలయ్య మాత్రమే అని టాక్‌. ఆయనకు వచ్చిన ఇమేజ్, క్రేజ్‌.. రీత్యా ఆయన ఎంత రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిన నిర్మతలు ఇవ్వక తప్పదు. అయితే ప్రస్తుతం రూ.30 కోట్ల రెమ్యూనరేషన్ మాత్రమే బాలయ్య తీసుకుంటూ.. పలు యాడ్స్, ఓటిటి షోల ద్వారా అభిమానులకు మరింత దగ్గరవుతున్నాడు. ప్రస్తుతం సీనియర్ స్టార్ హీరోలు అందరిలో టాప్ రేంజ్ లో ఫామ్ లో దూసుకుపోతూ తన సత్తా చాటుతున్న బాలయ్య.. తన నెక్స్ట్ సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటాడు వేచి చూడండి.