నాకు పద్మ విభూషణ్ అవార్డు రావడానికి కారణం వాళ్లే.. చిరంజీవి ఎమోషనల్ పోస్ట్..

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి అత్యున్నత గౌరవం పద్మ విభూషణ్ అవార్డు దక్కిన సంగతి తెలిసిందే. గురువారం రాత్రి కేంద్ర ప్రభుత్వం దీన్ని అఫీషియల్ గా ప్రకటించింది. దీంతో చాలామంది చిరంజీవి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే ఆ అవార్డు రావడం పట్ల చిరు ఎమోషనల్ ట్విట్ షేర్ చేసుకున్నాడు. నాకు ఈ అవార్డ్ వ‌చ్చింద‌ని తెలిసిన క్షణం నాకు ఏం మాట్లాడాలో.. ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. మనదేశంలో రెండవ అత్యున్నత పురస్కారం నాకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.

ఒక తల్లి కడుపున పుట్టకపోయినా, నన్ను తమ సొంత మనిషిగా భావించే కోట్లాదిమంది ప్రజల ఆశీస్సులు సినీ కుటుంబ సభ్యుల అండ నాకు ఉండడంతోనే నాకు ఇదంతా సాధ్యమైంది.. మీ అభిమానం, ప్రేమ, ఆదరణ కారణంగానే నేను ఈరోజు అవార్డును అందుకున్నా.. నాకు దక్కిన ఈ గౌరవం అవార్డ్‌ మీదే. నాపై చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయతలకు నేను ఏమి ఇచ్చిన రుణం తీర్చుకోలేను అంటూ ఎమోషనల్ అయ్యాడు. గత 45 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో వైవిద్య‌మైన పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్న అంటూ వివ‌రించాడు.

నిజ జీవితంలో కూడా నా చుట్టూ ఉన్న సమాజంలో అవసరమైన సహాయాన్ని నా చేతనయినంతవరకు చేస్తూనే ఉన్నా.. మీరు నాపై చూపిస్తున్న కొండంత అభిమానానికి.. నేను ప్రత్యేకంగా ఇస్తుంది గోరంతే. ఈ నిజం ప్రతిక్షణం నాకు మ‌రింత భాధ్య‌త‌ను పెంచుతూనే ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక భారత ప్రభుత్వానికి ప్రధాని నరేంద్ర మోడీ గారికి.. ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేసినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ చిరంజీవి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మెగా ఫ్యామిలీతో పాటు ఫాన్స్ కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.