మొదటిసారి డివోర్స్ పై స్పందించిన నిహారిక.. పెళ్లయ్యాకే అది తెలిసింది అందుకే విడిపోయాం అంటూ..

మెగా డాట‌ర్‌ నిహారికకు తెలుగు ప్రేక్షకుల ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే గతంలో చైతన్య జొన్నలగడ్డతో నిహారిక వివాహమైన సంగతి తెలిసిందే. ఏడాదిలోనే వీరు విడాకులు తీసుకుని అందరికీ ఆశ్చర్యాన్ని కల్పించారు. ఇక తాజాగా నిహారిక మొట్టమొదటిసారి తన విడాకులపై స్పందిస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తన కెరీర్, వ్యక్తిగత జీవితం గురించి నిఖిల్ విజయేంద్రసింహ.. అనే ఓ యూట్యూబర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిహారిక ఎన్నో విషయాలను షేర్ చేసుకుంది.

చైతన్య జొన్నలగడ్డతో విడాకులపై నిహారిక మాట్లాడుతూ విడాకులతోనే జీవితం ముగిసిపోయినట్లుగా నేను అనుకోలేదని వివరించింది. ఎదుటివారిని ఈజీగా నమ్మకూడదని పెళ్లి తర్వాతే ఆ విషయం తెలిసింది. అదొక అనుభవ పాఠంగా నేను ముందుకు వెళుతున్న అంటూ చెప్పుకొచ్చింది. ఇప్పటికీ అవన్నీ గుర్తొస్తే కన్నీళ్లు వస్తాయని చెప్పుకొచ్చిన నిహారిక.. పెళ్లి అన్నది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైన ఘట్టం.. కలకాలం కలిసి ఉంటామని ఏ జంట‌ అయిన వివాహం చేసుకుంటారు అంటూ చెప్పుకొచ్చింది.

అంతేకానీ ఏడాదిలో విడిపోతామని భారీగా ఖర్చుపెట్టి ఎవరూ పెళ్లి చేసుకోరు కదా అంటూ చెప్పుకొచ్చిన నిహారిక.. ఎలాంటి అడ్డంకులు లేకుండా తమ రిలేషన్షిప్ సాఫీగా సాగాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు.. అలా ఆలోచించే ప్రేమ పెళ్లి బంధం లోకి అడుగులు వేస్తారు.. నేను అలాగే అడుగులు వేసా కానీ నేను ఊహించినట్లు ఏదీ లేదు.. అందుకే విడిపోవలసి వచ్చింది అంటూ వివరించింది. ఇక నా విడాకుల గురించి నా కుటుంబ సభ్యులు స్నేహితులు ఏమనుకుంటున్నారా అనేది నాకు ముఖ్యం అంటూ చెప్పుకొచ్చింది.

నేనెవరో, నా గురించి ఏమీ తెలియని వారు ఎన్ని మాట్లాడినా నేను పట్టించుకోను. గత రెండేళ్లలో ఫ్యామిలీ విలువలు చాలా అర్థమయ్యాయి.. అని నిహారిక వివరించింది. నన్ను ఓ బరువుగా ఫ్యామిలీ ఎప్పుడూ భావించలేదని చెప్పుకొచ్చింది. ఇక ఏపీ ఎన్నికల విషయంపై కూడా స్పందిస్తూ ప్రజలంతా ఎవరు ఏపీ సీఎం కావాలని కోరుకుంటారు వారికే నేను ఓటు వేస్తా అంటూ చెప్పుకొచ్చింది. ఇక పవన్ కళ్యాణ్ తో పాటు జనసేన తరఫున ఏపీలో ప్రచారం చేస్తున్నట్లు నిహారిక వివరించింది.