మరోసారి సిద్దు ‘ టిల్లు స్క్వేర్ ‘ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

డిజె టిల్లు మూవీతో స్టార్ సెలబ్రిటీగా క్రేజ్‌ సంపాదించుకున్నాడు సిద్దు జొన్నలగడ్డ. ఈ సినిమా వెండితెర‌పై రిలీజై ఎలాంటి సంచలన క్రియేట్ చేసిందో అందరికీ తెలుసు. 2022లో రిలీజ్ అయిన ఈ సినిమాకు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ త్వరలోనే ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. మోస్ట్ అవైటెడ్ గా ఈ మూవీ కోసం అభిమానులతో పాటు సాధారణ ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా ఇప్పటికే పలుసార్లు వాయిదా పడింది. తొలత గతేడాది సెప్టెంబర్ 15న ఈ మూవీ రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు.

కానీ మల్టిపుల్ మూవీ రిలీజ్ కారణంగా వాయిదా వేశారు. 2024 ఫిబ్రవరి 9న రిలీజ్ చేస్తామని వివరించారు. కానీ ఫిబ్రవరిలో మళ్లీ ఏవో కారణాల‌తో మరోసారి వాయిదా వేశారు. ఈ మేరకు కొత్త రిలీజ్ డేట్ ను తాజాగా మేకర్స్ అనౌన్స్ చేస్తూ ప్రకటన ఇచ్చారు. సినిమాని మార్చి 29, 2024న గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ చేయబోతున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. ఏప్రిల్ లో ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి రిజల్ట్ రావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇక ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి వచ్చిన ప్రమోషన్ మెటీరియల్ అంతా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇక‌ ఈ సినిమా ఎప్పుడు రిలీజైన మంచి రిజల్ట్ ఉంటుందని సినీవర్గాలు చెప్తున్నాయి. రామ్ మిరియాల స్వరాలు అందించిన ఆల్బమ్ లో టికెట్ కొనకుండా, రాధికా వంటి పాటలు ఇప్పటికే తెగ ట్రెండ్ అవుతున్నాయి. చాట్ బస్టర్లుగా సంచలనం సృష్టించాయి. సినిమా నాణ్యత విషయంలో మేకర్స్ కూడా ఎక్కడ రాజీ పడలేదని.. కొన్ని అనుకోని పరిస్థితులు కారణంగానే ఫిబ్రవరి 9న సినిమా వాయిదా వేయాల్సి వచ్చిందని.. వేసవి సెలవుల్లో టిల్లు ఆట మొదలు పెట్టబోతున్నాడు అంటూ వివరించారు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వర హీరొయిన్ గా నటిస్తోంది.