‘ చంద్రముఖి ‘లో రజనీతో కలిసి చిందేసిన ఈ చిన్నారి.. ఇప్పుడు బుల్లితెర హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు చైల్డ్ ఆర్టిసిగా నటించి ప్రేక్షకుల నుంచి ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న వారు ఎంతోమంది ఉన్నారు. కొంతమంది స్టార్ హీరోలుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా సెట్టిల్‌ కాగా.. మరి కొంతమంది బుల్లితెరపై మెరుస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అయితే నేటి తరంలో కూడా ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్టులు చాలామంది హీరో, హీరోయిన్లుగా కంటిన్యూ అవుతున్నారు. అలాంటి వారిలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి, ఇటీవల హనుమాన్‌తో భారీ సక్సెస్ సాధించిన తేజ స‌జ్జ‌, కావ్యా లాంటి వారు కూడా ఉన్నారు.

అయితే అలా ఒకప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ చంద్రముఖి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించిన ఈ చిన్నది ఇప్పుడు బుల్లితెరపై హీరోయిన్గా రాణిస్తుంది. ఈ సినిమాలో రజనీకాంత్ తో కలిసి ఆమె కూడా ఓ పాటలో చిందాడింది. నయనతార, జ్యోతిక, ప్రభు, నాజర్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బ‌స్ట‌ర్ సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అత్తిందో తిందియోమ్‌ తోందన సాంగ్ అంత త్వరగా మర్చిపోలేము. ఈ పాటలో కనిపించే చిన్నారి బొద్దుగా రజనీతో పాటు పాట పాడేస్తూ ఉంటుంది. ఈ చిన్నారి పేరు ప్రహ‌ర్షిత శ్రీనివాస్.

బాలనటిగా తమిళంలో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన ఈ బుడ్డిది.. తర్వాత వెండితెరకు దూరంగా ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ చిన్నారి ఫొటోస్ తెగ వైరల్ అవుతున్నాయి. 18 ఏళ్లకు నటనకు దూరంగా ఉన్న ప్రహ‌ర్షిత ఇప్పుడు బుల్లితెరపై సీరియల్స్ లో నటిస్తూ మెప్పిస్తుంది. తనకు 2021లో వివాహం జరిగింది. 2022 కు పాప జన్మించింది. పెళ్లి తర్వాత నటనకు దూరంగా ఉన్న ప్రహర్షిత సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ సందడి చేస్తుంది. ఇటీవలే ఆమె లేటెస్ట్‌ వీడియో షేర్ చేసుకోగా ఆమె ఎంతో అందంగా ఉందని.. కాస్త బోద్దుగా క‌నిపిస్తుంద‌ని కామెంట్లు వినిపిస్తున్నాయి.