మీ ‘ స్కంధ‌ ‘ మూవీ సూపర్ ఉందన్న కృతి శెట్టి ఫ్యాన్.. ఆమె రియాక్షన్ చూస్తే షాక్ అవుతారు..

గతేడాది థియేటర్‌లలో విడుదలైన స్కంధ‌ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ రిజల్ట్స్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్, రామ్ పోతినేని హీరోగా నటించిన ఈ సినిమాతో ఆమెకు చాలా నెగటివిటీ వ‌చ్చింది. ఇక తాజాగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసింది. కాగా అక్కడ ఓ అభిమాని కృతి శెట్టితో మీ స్కంద మూవీ సూపర్ ఉంది అంటూ కామెంట్స్‌ చేయగా షాక్ అవడం కృతి శెట్టి వంత‌యింది. కృతి శెట్టి వెంటనే తేరుకొని.. స్కంద మూవీ సూపర్ గా ఉంది.. అయితే అందులో నేను యాక్ట్‌ చేయలేదు అంటూ సమాధానం ఇచ్చింది.

Kriti Shetty graces an inaugural event in a peach silk saree!

దీంతో అక్కడ ఉన్న ప్రేక్షకులంతా కృతి శెట్టి సమాధానానికి ఆశ్చర్యపోయారు. ఆమె ఎంతో ఓర్పుగా.. పాజిటివ్గా స్పందించినందుకు ఆమెపై ప్రశంసలు కురిపించారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లో పరిమితంగా సినిమాల్లో నటిస్తుంది కృతి. ఆమె రెమ్యూనరేషన్ కూడా చాలా తక్కువే. కెరీర్ మొదట్లో వరుస విజయాలను అందుకుంటు దూసుకుపోయిన కృతి.. తర్వాత మెల్లమెల్లగా ఫ్లాప్‌ల బాటతో టాలీవుడ్‌కు దూరమైంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఆమెకి అవకాశాలు రావడం లేదు.

Skanda: The Attacker Movie: Showtimes, Review, Songs, Trailer, Posters,  News & Videos | eTimes

అయితే ఇతర ఇండస్ట్రీలపై ఫోకస్ పెట్టిన ఆమె.. మంచి అవకాశాలను దక్కించుకుంటుంది. ఇక ఈ సినిమాల్లో ఆమె నటన పై ఫుల్ ఫోకస్ పెట్టి కంటెంట్ సరైనది ఎంచుకుంటూ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించే ప్ర‌య‌త్నాలు చేస్తుంది. కృతి శెట్టికి సోషల్ మీడియాలో మాత్రం ఫ్యాన్ ఫాలోయింగ్ రేటు రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఇక ఆమె కథలు ఎన్నిక విషయంలో తప్పులు చేయడం వల్లే ఆమెకు టాలీవుడ్ లో ఆఫర్లు తగ్గాయని వార్తలు కూడా గతంలో వైరల్ అయ్యాయి. ఇక‌ 2024వ సంవత్సరమైనా ఈ కథనాయిక‌కు కలిసొస్తుందేమో చూద్దాం.