‘ జై హనుమాన్ ‘ మూవీ లో ఆ బాలీవుడ్ స్టార్.. ప్రశాంత్ వర్మ

ప్రశాంత్ వ‌ర్మా దర్శకత్వంలో యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా.. తెర‌కెక్కిన మూవీ హనుమాన్. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయి.. బాక్సాఫీస్ వ‌ద్ద‌ ఇప్పటికే ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ త్వరలోనే సెట్స్ పైకి రానుంది. కాగా ఈ సిక్వెల్‌లో ఆంజనేయ స్వామి పాత్రలో స్టార్ హీరో నటిస్తున్నాడని దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. దానికోసం బాలీవుడ్ నటులను ఎంపిక చేయడానికి ఆడిషన్స్ చేస్తున్నట్లు ఓ ఇంటర్వ్యూలో వివరించాడు.

హనుమంతుడు పాత్రలో బాలీవుడ్ ప్రముఖ హీరో నటించే అవకాశం ఉంది. మేకప్, లుక్ టెస్ట్ చేసి ఎంపిక చేయాలనుకుంటున్న అంటూ వివరించాడు. పాత్రకు తగిన న్యాయం చేయగల వారిని తీసుకుంటాం. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే వివరాలు ప్రకటిస్తాం జై హనుమాన్ లో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ నటీనటులు నటించబోతున్నారు అంటూ వివరించాడు.

హనుమాన్ కంటే తాను రూపొందిస్తున్న మరో సినిమా అధిరా పెద్దదని చెప్పుకొచ్చాడు ప్ర‌శాంత్‌. అందులోనూ హనుమంతుడు సీన్స్ ఉండబోతున్నాయట. ఇక తేజ సజ్జ, అమృత అయ్య‌ర్, వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్ ప్రధాన పాత్రలో నటించిన హ‌నుమాన్‌ సినిమా సంక్రాంతి బరిలో రిలీజై రూ. 210 కోట్ల రన్ సాధించింది. ఇప్పటికీ అదే క్రేజ్ తో దూసుకుపోతుంది.