” నేను సూర్యతో విడాకులు అందుకే తీసుకుంటున్నాను “… మొదటిసారి విడాకులపై స్పందించిన జ్యోతిక..!

కోలీవుడ్ స్టార్ కపుల్ సూర్య మరియు జ్యోతిక గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. వీరిద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక వీరికి ఓ పాప, బాబు కూడా ఉన్నారు. ఇక సినిమా విషయాన్ని పక్కన పెట్టి తన ఫ్యామిలీతో ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు వీరిద్దరూ. ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంటపై తాజాగా కొన్ని ట్రోల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వీరిద్దరూ త్వరలో విడాకులు తీసుకోబోతున్నారు అంటూ కొన్ని ప్రచారాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు ఈ వార్తపై వీరిద్దరూ ఏ విధంగా కూడా స్పందించలేదు. దీంతో ఫాన్స్ సైతం నిరాశకు గురవుతున్నారు. ఇక తాజాగా ఈ విషయంపై జ్యోతిక స్పందించింది. తాజాగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన జ్యోతిక.. ఏకంగా బాలీవుడ్ లో మూడు సినిమాలు కమిట్ అయింది.

ఇక ప్రస్తుతం ఈ షూటింగ్లో ఫుల్ బిజీగా ఉంది జ్యోతిక. ఇక ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జ్యోతిక మాట్లాడుతూ..” సినిమా షూటింగ్ క్రమంలోనే మేము ముంబై కి వచ్చాము. అలానే పిల్లల చదువుల గురించి కూడా ఇక్కడ ఉండాల్సి వచ్చింది. పిల్లల చదువులు పూర్తికాగానే తిరిగి మేము చెన్నై వస్తాము. అంతేకానీ మా మధ్య ఎలాంటి విభేదాలు జరగడం లేదు. మేమిద్దరం కొన్ని రోజులు మాత్రమే విడాకులు తీసుకున్నాము.. ” అంటూ ఫన్నీ గా క్లారిటీ ఇచ్చింది జ్యోతిక. ప్రస్తుతం ఈమె కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.