” నాకు అది అన్నా,, అలా చేయడం అన్నా చాలా ఇష్టం “.. మనసులో ఉన్న నిజాలని బయటపెట్టిన సితార..!

మహేష్ ముద్దుల కూతురు సితార మనందరికీ సుపరిచితమే. ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫ్యాన్స్ తో చిట్ చాట్ నిర్వహించే ఈ ముద్దుగుమ్మ కి ఏ రేంజ్ పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తండ్రికి త‌గ్గ‌ తనియురాలు అని కూడా అనవచ్చు.

ఇటీవల జ్యువలరీ బ్రాండ్ యాడ్లో నటించి మరింత పాపులారిటీని సంపాదించుకుంది సితార. ఇక ఈ ముద్దుగుమ్మ త్వరలోనే హీరోయిన్గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు పలు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక తాజాగా తన తల్లి నమ్రత పుట్టిన రోజు సందర్భంగా సితార తన అభిమానులతో చిట్ చాట్ చేసింది. ఇందులో భాగంగానే ఓ నేటిజన్ మీరు సినిమాల్లోకి రావాలని అనుకుంటున్నారా అని ఓ ప్రశ్న అడగగా..” నాకు సినిమాలు అన్న.. నటన అన్న చాలా ఇంట్రెస్ట్. సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాను తప్పకుండా ” అంటూ రిప్లై ఇచ్చింది. ఇక ప్రస్తుతం ఈమె రిప్లై ని చూసిన సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.