70 శతకంలో ఏకంగా బుల్లెట్ బండి నడిపిన కేఆర్ విజయ గురించి ఆసక్తికర విషయాలు..!

కేఆర్ విజయ అంటే ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు కానీ.. అప్పటి తరంలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించింది ఈమె. ఈ ముద్దుగుమ్మ ఓ తమిళ నటి. కేఆర్ విజయ 1963 సంవత్సరంలో ” కర్పగం ” అని సినిమా ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

ఈ మూవీకి గోపాలకృష్ణన్ సంగీతమందించాడు. ఈమె తన కెరీర్లో దాదాపు 500కు పైగా సినిమాలలో నటించి మంచి పేరు ప్రఖ్యాతలు పొందింది. మొదట్లో చెన్నైలోని టీ నగర్ లో నివసించిన ఈమె భర్త చనిపోయిన అనంతరం కేరళలో ఉండేది. ఈమె తెలుగులో కూడా చాలా పాపులారిటీని సంపాదించుకుంది. ఈమె ఎక్కువగా భక్తి ప్రధాన సినిమాలలో నటించేది. ఇక ఈ ముద్దుగుమ్మ పర్సనల్ విషయానికి వస్తే.. ఈమె నవంబర్ 30, 1948లో కేరళలో జన్మించింది.

తల్లి కేరళ కి చెందగా తండ్రి మాత్రం ఆంధ్రప్రదేశ్ కి చెందినవారు. ఈమె ఎక్కువ కాలం తమిళ్ లోనే గడిపింది. ఇక ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్ సినిమాతో భారీ పాపులారిటీని దక్కించుకుంది. ఇక ఇప్పటివరకు 60 ఏళ్లకు పైగా సినిమాల్లో నటించిన ఈమె గురించి తెలియని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విజయ 70వ దశకం నుంచి ప్రముఖ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ను నడిపేదట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫోటోలని చూసి కొందరు షాక్ అవుతున్నారు కూడా.