8 సినిమాలలో క్యామియో రోల్స్ లో మెప్పించిన రాజమౌళి.. ఆ సినిమాల లిస్ట్ ఇదే..?

ప్రపంచం గ‌ర్వించే విధంగా టాలీవుడ్ ఇండస్ట్రీని తలెత్తుకునేలా చేసిన దర్శకుడు రాజమౌళి. ఆయ‌న‌కు పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో మరో పాన్ వరల్డ్ సినిమాలు తెర‌కెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా కోసం హాలీవుడ్ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఆర్‌ఆర్ఆర్ సినిమాతో ఇండియాకు ఆస్కార్ అవార్డ్‌ తీసుకువచ్చిన రాజమౌళి కేవలం 11 సినిమాలు తోనే ఈ జనరేషన్ దిగ్గజ డైరెక్టర్ గా పాపులర్ అయ్యాడు.

రైటర్ గా వర్క్ చేయకపోయినా డైరెక్టర్గా తనను కొట్టే వారే లేరు అంటూ ఎప్పటికప్పుడు రాజమౌళి ప్రూవ్ చేసుకుంటూనే ఉంటున్నాడు. అయితే ప్రతి డైరెక్టర్ లను నటుడు కూడా ఉంటాడు. తమకున్న యాక్టింగ్ ఇంట్రెస్ట్ ని వెండితెరపై క్యామియో రూల్స్ ద్వారా కూడా ప్రేక్షకులకు పరిచయం చేస్తాడు. అలా రాజమౌళి ఇప్పటివరకు ఏకంగా 7 సినిమాల్లో నటించి మెప్పించాడు. ఇంతకీ ఆ సినిమాల లిస్ట్ ఏంటో చూద్దాం. నితిన్ హీరోగా నటించిన సై. ఈ సినిమాలో నల్లబాలు (వేణుమాధవ్) అనుచ‌రుడుగా రాజమౌళి కాసేపు కనిపించాడు.

ఆ మూవీ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. తర్వాత రెయిన్బో సినిమాల్లో రాజమౌళి చిన్న పాత్రలు కనిపించాడు. మగధీర సినిమాల్లో ఓ సాంగ్ లో మెరిసాడు. ఈగ సినిమా స్టార్టింగ్ లో కూతురికి స్టోరీ చెప్పే తండ్రిగా రాజమౌళి క‌నిపించాడు. బాహుబలి సినిమాలో సారా అమ్మే వాడిగా కాసేపు మెప్పించాడు. నాని మజ్ను మూవీలోనూ తన ఒరిజినల్ క్యారెక్టర్ లో రాజమౌళి కనిపించాడు. రాధే శ్యామ్‌ సినిమాలో క‌థ‌ ప్రారంభించేది రాజమౌళి పాత్రతోనే.

ఆర్‌ఆర్ఆర్ లో ఎత్తర జెండా సాంగ్‌లో మెప్పించాడు. ఇలా రాజమౌళి ఏకంగా ఎనిమిది సినిమాలలో కనిపించగా.. ఈ సినిమాల్లో ఆయన దర్శకత్వం వహించిన సినిమాలన్నీ సూపర్ హిట్లుగా నిలిచాయి. ఇక మిగిలిన సినిమాల్లో రెయిన్బో, రాధే శ్యామ్‌ డిజాస్టర్లుగా.. నాని మజ్ను మూవీ సూపర్ హిట్‌గా ఉన్నాయి. ఇక రాజమౌళి పూర్తి నడివి ఉన్న పాత్రలో సినిమాలు నటిస్తే చూడాలని ఆయన అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.