ఇనప ముక్కల జోలికి వెళ్లొద్దు బ్రదర్ అంటూ అప్పుడు అన్న గారు ఇచ్చిన సలహా నా కుటుంబాన్ని కాపాడింది.. చిరంజీవి

విశాఖలో లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ పుణ్య తిధి, ఏఎన్ఆర్ సతీ జయంతి వేడుకలు ఇటీవ‌ల ఘ‌నంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు. చిరంజీవి.. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఇద్దరితో కలిసి నటించిన నటుడు కావడంతో వీరిద్దరికీ చిరంజీవికి మంచి అనుబంధము ఉంది. ఈ నేపథ్యంలో చిరంజీవి ఈ ఈవెంట్లో సందడి చేశారు. వీరిద్దరి గురించి గుర్తుచేసుకున్న చిరంజీవి.. ఇండస్ట్రీలో తనకు అప్పుడప్పుడే మంచి పేరు వస్తున్న టైం లో ఎన్టీఆర్ ఇచ్చిన సలహా తన కుటుంబాన్ని కాపాడిందని మెగాస్టార్ చెప్పుకొచ్చాడు.

ఒక సమయంలో ఆయన కలవడానికి వెళ్ళినప్పుడు ఎన్టీఆర్ నన్ను పిలిచి రండి బ్రదర్ కూర్చోండి మీరు బాగా వృద్ధిల్లోకి వస్తున్నారు అన్నార‌ని అదే సమయంలో ఆయన ఇచ్చిన ఓ సలహా నా కుటుంబాన్ని కాపాడింది అంటూ వివరించాడు. మీ సంపాదనని ఇనుప ముక్కల కోసం వృధా చేసుకోవద్దు.. మంచి ఇల్లు కట్టుకోండి, స్థలాలు తీసుకోండి.. అని ఎన్టీఆర్ అప్పట్లో నాకు సలహా ఇచ్చారని చిరంజీవి వివరించాడు. స్టార్ట్ డమ్‌ ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియదు. మన సంపాదనని దాచిపెట్టుకోవాలి అంటూ ఎన్టీఆర్ చెప్పిన మాటలు నాకు ఇప్పటికి గుర్తున్నాయి అంటూ చిరంజీవి వివరించాడు.

ఎన్టీఆర్ చెప్పే వరకు తనకు కారులు అంటే బాగా ఇష్టం ఉండేదని.. మార్కెట్లోకి కొత్త కారు వస్తే ఎలాంటి కారు కొనాలి అని ఆలోచించే వాడినని.. అయితే ఎన్టీఆర్ గారు చెప్పిన ఆ సలహాతో అలాంటి ఆలోచనలు మానేసి ఆయన సలహాలు ఫాలో అయ్యానని.. ఆ సలహాని నన్ను నా కుటుంబాన్ని ఇప్పటివరకు కాపాడింది అంటూ చిరంజీవి వివరించారు. ఎంతో అనుభవంతో దూర దృష్టితో ఎన్టీఆర్ తనకు అలాంటి సలహా ఇచ్చారని.. చిరంజీవి వివరించాడు. ప్రస్తుతం ఈ కార్యక్రమంలో చిరంజీవి.. ఎన్టీఆర్ గురించి చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇంకా ఈ ఈవెంట్‌లో చిరంజీవి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు.