సినిమా చేయడానికి ఆ బాలీవుడ్ హీరో ఛాన్స్ ఇచ్చిన నో చెప్పిన పూరి జగన్నాథ్.. కారణం ఏంటంటే..?

ప్రస్తుతం టాలీవుడ్ సినిమాల హావ‌వా పాన్ ఇండియా రేంజ్ లో నడుస్తున్న సంగతి తెలిసిందే. వరుస తెలుగు సినిమాల డైరెక్టర్లు బాలీవుడ్ జనాలను ఆకట్టుకుంటూ మంచి సినిమాలు తెరకెక్కించి సక్సెస్ సాధిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ప్రతి తెలుగు హీరో గాని డైరెక్టర్ గాని పాన్ ఇండియా రేంజ్ లో సినిమాల్లో పనిచేస్తున్నారు. తెలుగు సినిమా డైరెక్టర్లతో సినిమా చేయడానికి బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా పోటీ పడుతున్నారు. ఇప్పటికే సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో రణబీర్ కపూర్ యానిమల్ సినిమాలో నటించి సక్సెస్ సాధించాడు. రూ.900 కాట్ల పైన కలెక్షన్లను రాబట్టి ఈ సినిమా సూపర్ సక్సెస్ అందుకుంది. ఇలాంటి క్రమంలో తెలుగులో టాప్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్లతో సినిమాలు చేయడానికి బాలీవుడ్ హీరోలు ఆసక్తిగా ఉన్నారు.

ముఖ్యంగా షాహిద్ కపూర్ పూరితో ఓ సినిమా చేయాలని తెగ ట్రై చేస్తున్నాడట. కానీ పూరి మాత్రం షాహిద్‌తో సినిమా చేయడానికి ఆసక్తి చూపడం లేదని తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పూరి.. రామ్ తో చేస్తున్న డబుల్ ఇస్మార్ట్‌ సినిమా పూర్తి అయిన వెంటనే చిరంజీవితో సినిమా చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇలాంటి నేపథ్యంలో బాలీవుడ్ హీరోలను పెట్టుకుని సినిమా తెరకెక్కిస్తే చిరంజీవితో సినిమా చేయడం కుదరదు కాబట్టి.. బాలీవుడ్‌ హీరోలను దూరంగా పెట్టినట్లు తెలుస్తుంది. అయితే బాలీవుడ్ హీరోలు మాత్రం తెలుగు డైరెక్టర్లు ఎవరు దొరికిన వాళ్ళతో సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉంటున్నారు.

ఈ కారణంగానే టాలీవుడ్ ఇండస్ట్రీ వైపు నుంచి వెళ్లే డైరెక్టర్లు కథలు వినడానికి బాలీవుడ్ సెలబ్రిటీస్ ఆసక్తి చూపుతున్నారు. షాహిద్ కపూర్ నుంచి పూరికి ఏదైనా కథ ఉంటే వినిపించండి అని కాల్ వెళ్లినట్లు తెలుస్తుంది. పూరి మాత్రం ప్రస్తుతానికి తన దగ్గర మీ ఇమేజ్‌కు సరిపడా కథలు లేవని చెప్పడంతో.. షాహిద్ కపూర్ కొద్దివరకు నిరాశ చెందాడట. ఇప్పటికే షాహిద్ కపూర్.. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో కబీర్ సింగ్ సినిమా చేసి సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత షాహిద్ కు మరోసారి ఆ రేంజ్ లో హిట్ పడలేదు. దీంతో త‌న‌తో టాలీవుడ్ డైరెక్టర్స్ ఎవరైనా సినిమా తెరకెక్కిస్తే బాగుండని షాహిద్ భావిస్తున్నాడట. అయితే ఆయనతో సినిమా తీసి సక్సెస్ సాధించే తెలుగు డైరెక్టర్ ఎవరో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాలి.