ఈగిల్ థియేటర్స్ నాగ్ సినిమాకే.. క్లారిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్..

రవితేజ, కార్తీక్ ఘటమ‌నేని కాంబినేషన్‌లో తెర‌కెక్కుతున్న ఈగిల్ మూవీ సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకి రానంది అంటూ మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఈ సినిమాను మేకర్స్‌ ఫిబ్రవరి 9వ తేదీకి పోస్ట్ పోన్ చేశారు. 250 థియేటర్లు సినిమాకు ఉన్నా సరే ఇతర సినిమాలకు మేలు చేయాలని మంచి ఉద్దేశంతో ఈ సినిమా రిలీజ్‌ను మేకర్స్ వెనక్కు తోసారు. ఈ సినిమాకు ఒక రోజు ముందు యాత్ర 2 రిలీజ్ కానుండగా.. ఫిబ్రవరి 9న ఊరు పేరు భైరవకోన సినిమా రిలీజ్ అయ్యే ఛాన్సులు కూడా ఉన్నట్లు తెలుస్తుంది.

Fastest 100 Films Is Our Target: Producer TG Viswa Prasad

ఇక తాజాగా రవితేజ ఈగిల్ సినిమా ధియేటర్స్ మొత్తం నాగార్జున నా స్వామి రంగా సినిమాకు ఇచ్చేస్తారంటూ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైర‌ల్‌ అయింది. దీనిపై స్పందించిన టిజే విశ్వప్రసాద్ మాట్లాడుతూ అలా ఏమీ లేదని.. సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యే అన్ని సినిమాలకు ఇస్తామంటూ వెల్లడించాడు. రవితేజ గారికి పరిస్థితులు వివరించి ఒప్పించామని చెప్పిన విశ్వప్రసాద్.. యాత్ర 2 మూవీ జానర్ వేరని.. ఈగల్ జానార్ వేరని.. కామెంట్ చేశాడు. రవితేజ గారికి హ్యూజ్ ఫాలోయింగ్ ఉందని.. అందరు హీరోలు ఫ్యాన్స్ రవితేజను అభిమానిస్తారంటూ వివ‌రించాడు. సంక్రాంతి పండుగకు మూడు సినిమాలకు స్పేస్ ఉంటుందని పేర్కొన్నారు రవితేజ.

Eagle (2024) - Movie | Reviews, Cast & Release Date - BookMyShow

గత సినిమాలతో పోల్చి చూస్తే ఈ సినిమా భిన్నమైన సినిమా అని.. ఎవరిని నిరుత్సాహపరచదు అంటూ చెప్పుకొచ్చాడు. ప్రభాస్ – మారుతి సినిమా అప్డేట్ జనవరి 15వ తేదీ వస్తుందని వెల్లడించాడు. రవితేజ గారితో మరో ప్రాజెక్ట్ చేయబోతున్నామని.. పోస్ట్ సమ్మర్లో ఈ సినిమా రిలీజ్ అవుతుందని, అలాగే శర్వానంద్, శ్రీ విష్ణువులతో సినిమాలు చేశామని వివరించాడు. ఈ ఏడాది 12 సినిమాలకు అటు, ఇటుగా రిలీజ్ చేస్తామని చెప్పినా ఆయన.. కరోనా సమయంలో ఓటీటీ కోసం కొన్ని సినిమాలను చేశానని కామెంట్లు చేశాడు. ఇక రవితేజ ఈగిల్‌ పోస్ట్ పన్ చేసినా సినిమా రిలీజైన త‌ర్వాత ఆ మూవీ ఎంజాయ్ చేశ్తామ‌ని.. ఈ మూవీ మంచి బ్లాక్ బ‌స్టర్ సాధించాలి అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.